Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

మహిళల సంక్షేమమే ధ్యేయం : ఈటల

NIRMAL

నిర్మల్ : మహిళల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ మండల కేంద్రంలో నిర్మించిన మండల సమాఖ్య భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వరిధాన్యం కొనుగోలులో ఐకెపి సంఘాల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. రాష్ట్రంలో ఐకెపి ఆధ్వర్యంలో 75శాతం ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. డ్వాక్రా రుణాలు సకాలంలో చెల్లించి ఆర్థికాభివృద్ధి సాధించాలని ఆయన మహిళలకు సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

Effort on Women Welfare : Minister Etala

Comments

comments