చెన్నయ్ : తమిళనాడు అభివృద్ధికి కృషి చేస్తున్నామని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. తమిళనాడు ఉన్నత సంస్కృతికి గర్విస్తున్నామన్నారు. జల్లికట్టు క్రీడ నిర్వహణకు తమిళుల ఐక్యతపై ఆయన స్పందించారు. తమిళ ప్రజల ఆకాంక్షలు తీర్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. జల్లికట్టు ఆర్డినెన్స్‌పై శనివారం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ సంతకం చేయనున్నారు.