Home తాజా వార్తలు గ్రామపంచాయతీల బలోపేతానికి కృషి : జూపల్లి

గ్రామపంచాయతీల బలోపేతానికి కృషి : జూపల్లి

JUPALLI

హైదరాబాద్ : తెలంగాణలో గ్రామపంచాయతీల బలోపేతానికి కృషి చేస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 8684 గ్రామపంచాయతీలు ఉన్నాయని చెప్పారు. తెలంగాణ ఏర్పడే నాటికి 5,857 గ్రామపంచాయతీలకు సొంత భవనాలు ఉన్నాయని, తాము అధికారంలోకి వచ్చాక 2,827 గ్రామ పంచాయతీలకు భవనాలు మంజూరు చేశామన్నారు. గ్రామపంచాయతీలకు నిధురలు పెంచే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని పేర్కొన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మారుస్తామని ఆయన చెప్పారు.