Search
Monday 24 September 2018
  • :
  • :

గుడ్డు వెజ్జా.. నాన్‌వెజ్జా.. గుట్టు విప్పేసిన శాస్త్రవేత్తలు

Egg-Curry

న్యూయార్క్: ప్రపంచంలో సరైన సమాధానం లేని ప్రశ్న ఏదైనా ఉందంటే అది.. ‘కోడి ముందా.. గుడ్డు ముందా?’ దీనికి ఇంతవరకూ సమాధానం తేలనేలేదు. అయితే దీనికి అనుబంధంగా ఉన్న మరో కఠిన ప్రశ్నకు సమాధానం లభించిది. అదే.. ‘గుడ్డు వెజ్జా.. నాన్ వెజ్జా?’… చాలామంది శాకాహారులు గుడ్డును మాంసాహారంగా భావించి దానిని తినరు. వారి అభిప్రాయంలో నాన్‌వెజ్ కేటగిరీకి చెందిన కోడి… ఈ గుడ్డును ప్రసాదిస్తుంది. ఈ కారణంగానే దీనిని నాన్‌వెజ్‌గా భావిస్తారు. అలా అయితే పశువుల నుంచి వచ్చే పాలు శాకాహారం ఎలా అవుతుందనేది నాన్‌వెజ్ ప్రియుల ప్రశ్న. దీనిని పక్కనపెడితే.. సాధారణంగా మార్కెట్‌లో లభించే గుడ్లు అన్‌ఫెర్టిలైజర్ అయి ఉంటాయి. అంటేవాటి నుంచి కోడిపిల్ల బయటకు రాదు. అందుకే గుడ్డును శాకాహారంగా భావించాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనికితోడు వారు శాస్త్రీయపరమైన వివరణ కూడా ఇచ్చారు. గుడ్డులో మూడు భాగాలుంటాయి. శాస్త్రవేత్తలు తెలిపినదాని ప్రకారం గుడ్డులోని తెల్లని భాగంలో ప్రొటీన్లుంటాయి. దానిలో ఎంటువంటి జంతు పదార్థం ఉండదు. అంటే ఎగ్‌వైట్ శాకాహారమని తేల్చిచెప్పారు. ఇక పచ్చసొన విషయానికొస్తే దానిలో అత్యధికంగా ప్రొటీన్లు, కోలెస్ట్రాల్ ఉంటుంది. అయితే మరో కోడితో సంపర్కం జరిగినప్పుడే ఇది మాంసాహారంగా మారుతుంది. కోడి జన్మించిన ఆరు నెలల తరువాత ఒకటి లేదా రెండు రోజులకు గుడ్డును పెడుతుంది. అయితే ఈ ప్రక్రియ కోడిపెట్ట లేదా పుంజుతో సంపర్కం అవసరం లేకుండానే జరుగుతుంది. వీటినే అన్‌ఫెర్టిలైజర్ ఎగ్ అంటారు. దీని నుంచి కోడిపిల్ల వచ్చేందుకు అవకాశం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Egg vegetarian? Or meat? Scientists report

Comments

comments