Home మహబూబ్‌నగర్ అధ్వాన్నంగా అంగన్‌వాడీలు…

అధ్వాన్నంగా అంగన్‌వాడీలు…

కుళ్లిన కూరగాయలతో భోజనం
అందుబాటులో ఉండని నిర్వాహకులు
అక్షరం ముక్కరాని ఆయాలు

Vegetable-and-Eggs

మనతెలంగాణ/నవాబ్‌పేట్/ అడ్డాకుల: ప్రభుత్వం చిన్నారుల సంక్షేమ నిమిత్తం అక్షర జ్ఞానం అందజేస్తూ భోజన వసతిని కల్పించి వివిధగ్రామాల్లో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంగన్‌వాడీలు స్థానికంగాఅందుబాటులో ఉండకపోవడంతో అక్షరంముక్కరాని ఆయాల పర్యవేక్షణలో చిన్నారులకు అక్షరాభ్యాసం కరువై సమర్థ నిర్వాహణ లేక అధ్వానంగా మారిన పరిస్థితి మండలంలో నెలకొంది.మండల పరిధిలోని కూచూరు గ్రామంలోని అంగన్‌వాడీలను శుక్రవారం మన తెలంగాణ పరిశీలించగా ఆసక్తికర విషయాలు వెలుగులోకొచ్చాయి. గ్రామంలోని ఒక అంగన్‌వాడీ కేంద్రంలో డబ్బులకు కక్కుర్తి పడి కుళ్లిన కూరగాయలతోవంటలు చేస్తూ భోజనాలు వడ్డిస్తూ చిన్నారుల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నదయనీయ పరిస్థితి ఏర్పడగా, మరో అంగన్‌వాడీ కేంద్రంలో నిర్వాహ కురాలు అందుబాటులో ఉండకపోవడంతో అక్షరంముక్కరాని ఆయా చేసెదేమి లేక చిన్నారులతో అపరిశుభ్ర పరిసరాలలో ఖాళీగా కూర్చుండిపోయిన పరిస్థితి ఏర్పడింది.

మండల పరిధిలోని కారుకొండ,కొండాపూర్,హజిలాపూర్,తీగల్‌పల్లి గ్రామాల్లోని అంగన్‌వాడీలలో కూడా ఇలాంటి పరిస్థితే దర్షనమిస్తుంది.సంబందిత వి షయంపై ఐసీడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ ను మన తెలంగాణ ఫోన్‌లో వివర ణ కు ప్రయత్నించగా ఆమె అందుబా టులో రాకపోవడంతో సూపర్‌వైజర్ బీ పాషాను వివరణ అడగ్గా ఆమె స్పం ది స్తూ అంగన్‌వాడీ నిర్వహణలో నిర్ల క్షం వహిస్తే ఉపేక్షించేది లేదని పై సెంటర్లలో విచారణ జరిపి చర్యలు తీ సుకుంటామన్నారు.ఏది ఏమైనా ప్రభు త్వం అంగన్‌వాడీ నిర్వాహకుల పరిస్థి తులను అర్థం చేసుకొని జీతాలను పెంచినా వారి ప్రవర్తనలో మార్పు రాక పోవడం విచారకరం.

మన తెలంగాణ/అడ్డాకుల : మండల పరిధిలోని ముత్యాలంపల్లిలో శుక్రవా రం గ్రామస్థులు అంగన్‌వాడీ కేంద్రం నిర్వహణ సరిగా లేదని అంగన్‌వాడీ కేంద్రానికి తాళం వేసి నిరసన తెలిపా రు. కేవలం ఏడు మంది విద్యార్థులు ఉన్నా వారికి నాణ్యమైన ఆహారం ఇ వ్వకుండా,కుళ్లిపోయిన గుడ్లు, ముక్కి పోయిన బియ్యంతో వండిన అన్నం పెడుతున్నారని, అన్నం లో పురుగులు కనబడుతున్నా సిబ్బంది పట్టించుకోవడం లేదని గ్రామంలో కేవలం ఇద్దరు బాలింతలు, ఇద్దరు గర్భిణీలు,21 మంది కిషోర బాలికలు ఉన్నారని , బాలింతలు, గర్బీణీలకు గుడ్లు ఇవ్వడం లేదని గ్రామస్థులు, అంగన్‌వాడీ టీచర్ స్వాతి పని తీరు పట్ల తీవ్ర విమర్శలు చేశారు.

పాఠశాలలో కనీసం ఒక గంట కూడా ఉండరని, ఆలస్యంగా వచ్చి వెంటనే వెళ్లపోతారని విమర్శించారు. విలేకరులు గ్రామానికి వెళ్లగా తాళం వేసిన కేంద్రాన్ని తెరిచి అపరిశుభ్రంగా కుళ్లిన గుడ్ల దుర్వాస ఉన్న వంటిగదిని చూపించి స్థలంలో వండిన ఆహారం తిని తమ పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారని ఉపాధ్యాయురాలు, ఆయాలపై అధికారు లు చర్యలు తీసుకునే వరకు కేంద్రాన్ని తెరవనీవ్వమని భీష్మించారు. నిరసన తెలిపిన వారిలో మధుసూధన్‌రెడ్డి, బాలకృష్ణారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, మధు, మన్యంకొండ, బాలన్న, అమ్మన్న, భాస్కర్, నాగేశ్వర్‌రెడ్డిలు ఉన్నారు.