Search
Tuesday 20 November 2018
  • :
  • :

శునకానికి 8 ఐఫోన్లు

Dogబీజింగ్: ఒక ఐఫోన్ గిఫ్ట్‌గా వస్తుందనగానే మన ఆనందానికి హద్దులుండవు. అలాంటిది ఏకంగా ఎనిమిది ఐఫోన్లు గిప్ట్‌గా వస్తున్నాయంటే ఇంకెలా ఉంటుంది. ఎగిరి గంతేయరు.. సాధారణంగా మనుషులైతే ఇలాగే చేస్తారు.. కానీ ఆ ఫోన్లు గిఫ్ట్‌గా వచ్చింది ఓ పెంపుడు కుక్కకు. అది కూడా కొత్త వెర్షన్ ఐఫోన్‌లు. ఈ మధ్య ఆపిల్ సంస్థ విడుదల చేసిన ఐఫోన్ 7ఎస్ ఫోన్లు. వాటిని దర్జాగా తన ముందు పెట్టుకొని హుందాగా సోఫాలో కూర్చుని తన యజమానికి తానంటే ఎంతిష్టమో ఓ స్టిల్ తో చెప్పేసింది ఆ కుక్క. ఇది చేసింది చైనాలోని అత్యంత ధనవంతుడైన వాంగ్ జియాన్‌లిన్ అనే వ్యక్తి కుమారుడు.

Comments

comments