Home తాజా వార్తలు రెండు బస్సులు ఢీ: 8 మంది మృతి

రెండు బస్సులు ఢీ: 8 మంది మృతి

Eight Members Died in Two Buses Collide

చెన్నై: తమిళనాడులోని సేలం సమీపంలోని మామందురు వద్ద శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు ప్రైవేటు బస్సులు ఢీకొని ఎనిమిది మంది దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మామందురు కలెక్టర్ రోహిణి ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డుపై ఉన్న బస్సులను క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు. మృతులలో నలుగురు కేరళ, ముగ్గురు కర్నాటక, ఒకరు తమిళనాడు వాసులు ఉన్నారు.