Search
Sunday 23 September 2018
  • :
  • :

ఐసిస్‌లో చేరిన 8 మంది చెన్నైయువత : ఎన్‌ఐఎ

Somalia-Terror-Attack

చెన్నై: గతేడాది అబుదాబిలో దొరికిన ఐసిస్ సానుభూతి పరులిచ్చిన సమాచారంతో ఎన్‌ఐఎ కీలక విషయాలను బయటపెట్టింది. చెన్నై కేంద్రంగా ఐసిస్ రిక్రూట్‌మెంట్ జరిగినట్టు ఎన్‌ఐఎ నిర్ధారణకొచ్చింది. మొత్తం 9 మంది ఐసిస్‌లో చేరేందుకు చెన్నై నుంచి వెళ్లినట్టు ఎన్‌ఐఎ అధికారులు గుర్తించారు. తమిళనాడు నుంచి ఎనిమిది మంది, తెలంగాణ నుంచి ఒకరు ఉన్నారని చెప్పింది. ఐసిస్ నియామకాలు, నిధుల సేకరణ, డబ్బు తీసుకున్న విషయాలపై ఎన్‌ఐఎ దర్యాప్తు చేస్తోంది. ఎన్‌ఐఎ అధికారులు తొమ్మిదిపై కేసు నమోదు చేసి, వారిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.

Comments

comments