Home తాజా వార్తలు కృష్ణా నదిలో 8 మంది విద్యార్థుల గల్లంతు

కృష్ణా నదిలో 8 మంది విద్యార్థుల గల్లంతు

Krishna-River

అమరావతి: కృష్ణా నదిలో ఎనిమిది మంది విద్యార్థులు గల్లంతైన ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం గుండిమెడ గ్రామంలో బుధవారం ఉదయం జరిగింది. కృష్ణా నదిని చూసేందుకు పాఠశాల విద్యార్థులు గుండి మెడ గ్రామ శివారులోకి వచ్చారు. ఎనిమిది మంది విద్యార్థులు స్నానాలు చేస్తుండగా వరద ప్రవాహానికి కొట్టుకొనిపోయారు. గల్లంతైన ఎనిమిది మందిలో నలుగురిని స్థానికులు రక్షించారు.  మూడు మృతదేహాలను బయటకు తీశారు. గల్లంతైన మరో విద్యార్థి కోసం  గజఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు.