Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

ఇక అప్పు అవసరమే లేదు

రైతాంగానికి ఏడాదికి రూ.8వేలు
ఆత్మహత్యల నివారణే లక్ష్యం
ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ 

    KTR-2

మన తెలంగాణ/ఎల్లారెడ్డిపేట: ‘ప్రతి రోహిణీలో రైతులు అప్పుల కోసం ఎదురుచూసేవారు. ఇక అవసరం రావొద్దనే లక్షంతోనే ప్రభుత్వం ఎరు వులు, విత్తనాల కోసం ఒక్కో ఎకరానికి రూ. 8 వేలు అందిస్తుంది. రైతాంగం ఆత్మహత్యలను ని రోధించి, వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్షంతోనే సిఎం కెసిఆర్ ఈ పథకాన్ని ప్రవేశ పెట్టారు’ అని ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కెటి ఆర్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలం రాచర్లబొప్పాపూర్‌లో బుధవారం రూ. ౩కోట్లతో ఏర్పాటు చేసిన గిడ్డంగులను ఆ యన ఎంపి వినోద్‌కుమార్‌తో కలిసి ప్రారంభిం చారు.

ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ రై తులు పండించిన ధాన్యాన్ని నిల్వ ఉంచేందుకు గ్రామాల్లో గోదాంల నిర్మాణం చేపట్టడం జరు గుతుందని చెప్పారు. ఆరు దశాబ్దాల పాలనలో ఏ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం కృషిచేసింది లే దని, వీటిని జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయ త్నం చేస్తున్నారని విమర్శించారు. 5వేల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వచేసే గోదాంలు ప్రస్తుతం జి ల్లాలో కూడా ఎక్కడా లేవన్నారు.  ఎంపి వినోద్ కుమార్ మాట్లాడుతూ మద్దతు ధర లేనప్పుడు రైతులు ధాన్యానికి ఎలాంటి ఇబ్బందులు పడకుం డా గోదాంలలో నిల్వ చేసుకోవచ్చని సూచించా రు. అంతకుముందు వీరు వెంకటా పూర్, ఎల్లా రెడ్డిపేట, నారాయణపూర్ గ్రామాల్లో పలు అభి వృద్ధి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో కలెక్టర్ కృష్ణభాస్కర్, టెస్కాబ్ చైర్మన్ కొండూ రి రవీందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments