Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

పాంచ్ పటాకా!

Eighth day Indian players have medal harvest in asian games

జకార్తా: ఆసియా క్రీడల్లో ఆదివారం ఎనిమిదో రోజు భారత ఆటగాళ్లు పతకాల పంట పండించారు. ఆదివారం అథ్లెటిక్స్‌లో భారత్‌కు మూడు రజత పతకాలు లభించాయి. అంతేగాక ఈక్వెస్ట్రియన్ వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో భారత్‌కు రెండు రజత పతకాలు దక్కాయి. దీంతో పాటు ఆర్చరీలో రెండు, బ్యాడ్మింటన్‌లో మరో రెండు పతకాలు ఖాయమయ్యాయి. ఇప్పటివరకు ఆసియా క్రీడల్లో ఆదివారమే భారత్ మెరుగైన ప్రదర్శన ఇచ్చిందని చెప్పాలి. స్వర్ణం గెలవకున్నా ఐదు రజతాలు సాధించి సత్తా చాటింది. పురుషుల హాకీలో కూడా భారత్ సెమీఫైనల్‌కు చేరుకుంది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్, పి.వి.సింధులు సెమీఫైనల్‌కు చేరుకున్నారు. దీంతో భారత్‌కు రెండు పతకాలు ఖాయమయ్యాయి. ఇక, అథ్లెటిక్స్‌లో మహ్మద్ అనస్, హిమదాస్, దుతి చంద్‌లు రజతాలు గెలుచుకున్నారు. ఈక్వెస్ట్రియన్ వ్యక్తిగత విభాగంలో ఫావుద్ మీర్జా రెండో స్థానంలో నిలిచి రజతం దక్కించుకున్నాడు.

సత్తా చాటిన అథ్లెట్లు                                                                                                                                              హిమ, దుతి, అనస్‌లకు రజతాలు                                                                                                                            ఈక్వెస్ట్రియన్‌లో సంచలనం

దూకుడుగా హిమ, దుతిచంద్

మహిళల అథ్లెటిక్స్ విభాగంలో భారత స్టార్ స్పింటర్లు హిమదాస్, దుతి చంద్‌లు రజత పతకాలు గెలిచి సత్తా చాటారు. మహిళల 400 మీటర్ల పరుగు పందెంలో హిమ అద్భుత ప్రతిభను కనబరిచింది. ఈ క్రమంలో కొద్ది తేడాలో స్వర్ణం గెలిచే అవకాశాన్ని చేజార్చుకుంది. బహ్రెయిన్ అథ్లెట్ సల్వా నాసేర్ కొత్త ఆసియా రికార్డుతో స్వర్ణం గెలుచుకుంది. మరోవైపు హిమదాస్ కూడా ఫైనల్‌కు చేరే క్రమంలో జాతీయ రికార్డును బద్దలు కొట్టింది. హిమదాస్ 50.79 సెకన్లలో లక్ష్యాన్ని చేరి తన ఖాతాలో రజత పతకం జమ చేసుకుంది. మరోవైపు సల్వా నాసేర్ 50.09 సెకన్లలో గమ్యాన్ని చేరి కొత్త రికార్డుతో స్వర్ణం సొంతం చేసుకుంది. కాగా, 100 మీటర్ల పరుగులో స్టార్ స్పింటర్ దుతి చంద్ రజతం సాధించింది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన దుతి చంద్ రజతం గెలిచి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టింది.

అసాధారణ ఆటను కనబరిచిన 11.32 సెకన్లలో లక్ష్యాన్ని అందుకుని తన ఖాతాలో వెండి పతకాన్ని జత చేసుకుంది. బహ్రెయిన్ అథ్లెట్ ఒడియాంగ్‌కు స్వర్ణం లభించింది. కాగా, ఏడో నంబర్ లైన్ నుంచి పరుగును ప్రారంభించిన దుతిచంద్ అద్భుతంగా రాణించింది. అయితే కీలక సమయంలో కాస్త తడబడడంతో స్వర్ణం గెలిచే సువర్ణ అవకాశాన్ని చేజార్చుకుంది. కాగా, ఈ విభాగంలో చైనా అథ్లెట్ వి యోంగ్లికు కాంస్యం లభించింది. కాగా, ఆసియా క్రీడల్లో 100 మీటర్ల పరుగులో పతకం రావడం భారత్‌కు 20 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం. ఇదిలావుండగా దుతి చంద్ తన పేరిట ఉన్న 11.29 జాతీయ రికార్డును తిరగరాసి ఉంటే కూడా ఆమె ఖాతాలో పసిడి పతకం చేరే ది. వంద మీటర్ల విభాగంలో స్వర్ణం గెలిచిన బహ్రెయిన్ అథ్లెట్ 11.30 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తి చేసి ప్రథ మ స్థానంలో ని లిచింది.

అనస్‌కు రజతం..
పురుషుల 400 మీటర్ల పరుగు విభాగంలో భారత అథ్లెట్ మహ్మద్ అనస్ రజత పతకం గెలుచుకున్నాడు. ప్రారంభం నుంచే అసాధారణ ప్రతిభను కనబరిచిన అనస్ 45.69 సెకన్లలో లక్ష్యాన్ని చేరి రజతం సొంతం చేసుకున్నాడు. ఏమాత్రం అంచ
నాలు లేకుండానే బరిలోకి దిగిన అనస్ ఏకంగా రజతం గెలిచి ప్రకంపనలు సృష్టించాడు. క్వాలిఫయింగ్ రౌండ్లలో పేలవమైన ప్రదర్శన ఇచ్చాడు. అయితే అనూహ్యంగా ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. పరుగు ప్రారంభానికి ముందు అనస్‌పై పెద్దగా ఎవరికి అంచనాలు లేవు. కానీ, అసాధారణ రీతిలో పుంజుకున్న అనస్ అందరి అంచనాలను తారుమారు చేస్తూ రెండో స్థానంలో నిలిచి రతజం దక్కించుకున్నాడు. ఖతార్ అథ్లెట్ హసన్ అబ్దుల్లా 44.89 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తి
చేసి స్వర్ణం గెలుచుకున్నాడు.

ఈక్వెస్ట్రియన్‌లో సంచలనం..మరోవైపు ప్రతిష్టాత్మకమైన ఈక్వెస్టియన్ విభా గం పోటీల్లో భారత్ రెండు రజతాలు గెలుచుకుని సంచలనం సృష్టించింది. తీవ్ర పోటీని సైతం తట్టుకుంటూ భారత ఆటగాళ్లు టీమ్ విభాగంలో రజతం గెలిచి సత్తా చాటారు. పురుషుల టీమ్ వి భాగంలో రాకేశ్ కుమార్, ఆశీష్ మాలిక్, జి తేందర్ సింగ్, ఫావుద్ మీర్జాలతో కూడిన జ ట్టు రజతం సాధించింది. కాగా, ఆసియా క్రీ డల్లో భారత్ ఈక్వెస్ట్రియన్ విభాగంలో పత కం గెలవడం 1982 తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక వ్యక్తిగత విభాగంలో స్టార్ రైడర్ ఫావుద్ మీర్జా 26.40 పా యింట్లతో రెండో స్థానంలో నిలిచి పతకం సొంతం చేసుకున్నాడు. అసాధారణ నైపుణ్యాన్ని కనబరిచిన ఫా వుద్ తీవ్ర పోటీని తట్టుకుం టూ రజతం గె లుచుకున్నాడు.

Comments

comments