Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

ఎక్కడికి పోతావు చిన్నవాడా…. శాటిలైట్ రైట్స్ @ 3.5 కోట్లు?

Ekkadiki-Pothavu-Chinnavada

తెలుగు హీరో నిఖిల్…తన సినిమాలు ఎప్పుడూ కొత్త గా, ఆలోచించే విధంగా ఉంటాయి. రియల్ లైఫ్ కు దగ్గరగా లేనప్పటికీ… రియల్ లైఫ్ కు ఏదో సంబంధం ఉన్నట్లుగానే ఉంటాయి తన సినిమాలు. స్వామి రారా, కార్తికేయ, శంకరాభరణం లాంటి సిినిమాలు అటువంటి కోవాలకి చెందినవే.

తాజాగా ఆయన నటించిన మరో మూవీ ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ మూవీ కూడా అలాంటిదే… నవంబర్ 18 న రిలీజ్ అయి హిట్ టాక్ నూ సంపాదించుకుంది ఈ మూవీ.

అయితే, ఈ మూవీ కి సంబంధించి ఓ గాసిప్ సినీ ఇండస్ట్రీలో తిరుగుతున్నది. మాటివి ఈ మూవీ శాటిలైట్ రైట్స్ ను రూ. 3.5 కోట్లు పెట్టి కొనుక్కొందట. అంతే కాదు, ఈ మూవీ తమిళ్, కన్నడ రిమేక్ హక్కుల  కోసం కొంతమంది తమిళ్, కన్నడ దర్శకులు ఈ మూవీ యూనిట్ ను సంప్రదించారట.

మూవీ మొత్తం తీయడానికి అయిన ఖర్చు మాత్రం ఏడు కోట్లయితే… ఇప్పటికే మాంచి హిట్ టాక్ తో మూవీ ఓపెనింగ్స్ కూడా బాగానే ఉన్నాయట. అంతే కాకుండా మాటీవీ భారీ మొత్తం ఇచ్చి మరీ శాటిలైట్ రైట్స్ ను కొనడం మూవీ కి ప్లస్ పాయింటేనని సినీ ఇండస్ట్రీ పెద్దలు అనుకుంటున్నారట.

Comments

comments