Home తాజా వార్తలు డబ్బు, నగల కోసం వృద్ధ దంపతుల హత్య

డబ్బు, నగల కోసం వృద్ధ దంపతుల హత్య

 

వికారాబాద్ వద్ద బయటపడ్డ మృతదేహాలు

కారు డ్రైవరు, సహచరుడు అరెస్టు

మన తెలంగాణ /వికారాబాద్ రూరల్ : వికారాబాద్ జిల్లా, అనంతగిరి గుట్టల్లో నంది ఘాట్ సమీపంలో వృద్ధ దంపతుల మృత దేహాలను ఆదివారం నాడు వికారాబాద్ పోలీసులు కనుగున్నారు. వికారాబాద్ రూరల్ సిఐ దాసు వివరాల ప్రకారం వికారాబాద్ జిల్లా అనంతగిరిగుట్టలో ఘాట్ రోడ్డు సమీపంలో నంది ఘాట్ వద్ద కుళ్ళిపోయిన శవం వాసన వస్తుందని స్థానికులు చెప్పడంతో సిఐ దాసు, ఎస్‌ఐ లక్షయ్యతో గాలింపు చేపట్టారు. కర్ణాటక రాష్ట్రంలో ఈ నెల 14న ఇద్దరు వ్యక్తులు తప్పిపోయినట్లు హుమ్నాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆ కేసును కర్ణాటక పోలీసులు విచారిస్తుండగా వృద్ధులను చంపిన వ్యక్తులు కారు డ్రైవర్ సతీష్, అతని స్నేహితుడు రాహుల్ ఆచూకీ లభ్యమైంది.

హంతకులను కర్ణాటక పోలీసులు విచారించగా సం గారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరువు మండలంలోని నందిగామ గ్రామానికి చెందిన భార్యాభర్తలు స్నేహలతారెడ్డి (72), నవరతన్‌రెడ్డి(76)లు కర్ణాటక రాష్ట్రం హుమ్నాబాద్ పరిధిలో 55 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని అద్దె ఇంట్లో జీవిస్తున్నారు. వీరి వద్ద డబ్బులు, నగలు ఉన్న విషయాన్ని పసిగట్టిన కారు డ్రైవర్ సతీష్, అతని స్నేహితుడు రాహుల్ కలిసి వారిని కారులో తీసుకొచ్చి టవల్‌తో వారి మెడకు ఉరి బిగించి చంపారు. కర్ణాటక పోలీసులు హంతకులను వికారాబాద్‌కు తీసుకొని వచ్చారు. వికారాబాద్ పోలీసుల సహకారం తో మృతదేహాలను గుర్తించి, మృత దేహాలను కర్ణాటక పోలీసులకు అప్పగించారు.

elderly couple killed by Car driver at Ananthagiri forest