Home తాజా వార్తలు వృద్ధురాలిని కొట్టి చంపిన దుండగులు…

వృద్ధురాలిని కొట్టి చంపిన దుండగులు…

Elderly woman murdered

 

సంగారెడ్డి: జిల్లాలోని అమిన్‌పూర్ మున్సిపల్ పరిధిలోని వాణి నగర్ ప్రాంతంలో వృద్ధురాలిని కర్రతో కట్టి చంపిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. వీరి స్వగ్రామం మెదక్ జిల్లా మక్కరాజుపేట కాగా.. కొంత కాలంగా అమిన్‌పూర్ మున్సిపల్ పరిధిలోని వాణి నగర్ లో నివాసం ఉంటున్నారు. అయితే గుర్తు తెలియని దండగులు ఒంటరిగా ఉన్న వృద్ధురాలు అరుందతి(57) కళ్లలో కారం చల్లి కర్రతో కొట్టి, గొంతు నులిమి చంపేశారు. అనంతరం వృద్ధురాలి ఒంటిపై ఉన్న బంగారు ఆభరాణలు, ఇంట్లోని వస్తువులు తీసుకొని పరారయ్యారు. స్థానికులు మృతురాలిని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలినికి చేరుకున్న వృద్ధురాలిని శవ పరీక్ష నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతురాలి భర్త సురేందర్ గౌడ్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Elderly woman murdered in Sangareddy District