Home జాతీయ వార్తలు ఎన్నికల ‘కోడ్’ ఎత్తివేత

ఎన్నికల ‘కోడ్’ ఎత్తివేత

Election Commission lifted model code

 

తక్షణమే అమల్లోకి

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల సందర్భంగా మార్చి 10 నుంచి అమలులో ఉన్న ఎన్నికల ప్రవర్తనా నియమావళిని (కోడ్) రద్దుచేస్తున్నట్టు ఎన్నికల సంఘం (ఇసి) ఆదివారం ప్రకటించింది. కోడ్‌ను తక్షణమే ఎత్తేస్తున్నట్టు కేబినెట్ సెక్రెటరీకి, రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్యకార్యదర్శులకు పంపిన ఆదేశంలో ఇసి తెలిపింది. కోడ్ అమలులో ఉన్నప్పుడు అధికారంలో ఉన్న పార్టీ అధికార యంత్రాంగాన్ని వాడుకోకూడదు. మరే ఇతర ప్రయోజనాలూ అధికారికంగా పొందకూడదని కోడ్ నిషేధం విధించింది. ఓటర్లను బెదిరించడం, ఓట్ల కోసం మతాన్ని వాడుకోవడం, లంచం ఇవ్వచూపడం వంటి చర్యలకు పాల్పడిన రాజకీయ నేతలను దోషులుగా నిలబెట్టేందుకు కోడ్ విధిస్తారు. రాజ్యాంగపరంగా తనకున్న అధికారంతో కోడ్ అతిక్రమించిన అభ్యర్థులు ప్రచారం చేయకుండా ఇసి నిరోధించింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీపై తీసిన బయోపిక్‌తో సహా రాజకీయ నాయకులపై తీసిన బయోపిక్‌లు ఎన్నికలయ్యేంతవరకూ విడుదల కాకుండా నిషేధించింది. ఏప్రిల్ 11న ప్రారంభమైన ఏడు విడతల ఎన్నికల ప్రక్రియ మే 19తో పూర్తయింది.