Search
Sunday 18 November 2018
  • :
  • :

సిరా గుర్తుపై ఎన్నికల సంఘం అభ్యంతరం

SIRA

ఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో బ్యాంకుల్లో నగదు మార్పిడి చేసుకున్న వారికి సిరా గుర్తు పెట్టడంపై కేంద్ర ఎన్నికల సంఘం అభ్యంతరం తెలిపింది. కొన్ని రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నగదు మార్పిడి చేసుకున్న వారికి సిరా గుర్తు పెట్టడం వల్ల గందరగోళం నెలకొనే అవకాశం ఉందని ఈసీ పేర్కొంది. ఈ క్రమంలోనే సిరా గుర్తు వాడకాన్ని నిలిపి వేయాలని కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఈసీ లేఖ రాసింది. నోట్ల రద్దుతో పది రోజులుగా ప్రజలు నోట్ల మార్పిడి కోసం బ్యాంకుల వద్ద బారులు తీరుతున్నారు. నగదు మార్చుకున్న వారే మళ్లీ మళ్లీ వస్తున్నారన్న ఉద్దేశంతో సిరా గుర్తును వాడాలని కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

Comments

comments