Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

పంచాయతీరాజ్‌కు అనుమతిచ్చిన ఎన్నికల సంఘం

panchayat

మన తెలంగాణ/ హైదరాబాద్:మన శాఖలో ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులకు లైన్ క్లియర్ అయింది. ఎన్నికల సంఘం ఆదేశాల కారణంగా ఒక్క పంచాయతీరాజ్‌శాఖలోనే ఇన్నాళ్లు ఈ ప్రక్రియ నిలిచిపోయింది. పంచాయతీ ఎన్నికల దృష్టా ఎవరిని బదిలీలు చేయవద్దని, పదోన్నతులు కల్పించినా పాత స్థానాల్లోనే కొనసాగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీరాజ్ శాఖను గత నెల 20నఆదేశించింది. కొత్త వారు వస్తే ఎన్నికల ప్రక్రియలో ఇబ్బందులు తలెత్తుతాయని ఈ నిర్ణయం తీసుకుంది. అయినప్పటికి పంచాయతీరాజ్ శాఖలో అయిదుగురు డివిజనల్ పంచాయతీ అధికారులకు జిల్లా పంచాయతీ అధికారులుగా పదోన్నతులు కల్పించి వారికి పోస్టింగులు ఇచ్చారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియస్ అయి కోర్టుకు వెల్లడం, కోర్టు వీరి పోస్టింగులను నిలిపివేయడం జరిగింది.  దీం తో పంచాయతీరాజ్ శాఖ పదోన్నతులు, బదిలీల ప్రక్రియను నిలిపివేసింది. అయితే బిసిల రిజర్వేషన్ అంశం పై కోర్టులో దాఖలైన పిటిషన్ కారణంగా ఎన్నికల ప్రక్రి య నిలిచిపోయింది. తాజాగా పంచాయతీలకు, కొత్త మున్సిపాల్టీలకు ప్రత్యేకాధికారులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో పంచాయతీ ఎన్నికల నిర్వహణ త్వరలో ఉండే అవకాశాలు లేవన్నది స్పష్టమయిం ది. దీంతో ఎన్నికల సంఘం పంచాయతీరాజ్ శాఖకు విధించిన ఆంక్షలను తొలగించినట్లు తెలుస్తోంది. రాష్ట్రం లో కొత్త జిల్లాలు ఏర్పడడం, పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వాటికి అత్యవసరంగా జిల్లాపంచాయతీ అధికారులను నియమించాల్సి రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఏ ర్పాటు చేసిన బదిలీలు, పదోన్నతుల కమిటి అప్పట్లోనే సమావేశమై 25 మంది అర్హులైన వారికి డిపిఒలుగా ప దోన్నతులు కల్పించాలని నిర్ణయించింది. అందులో భా గంగానే తొలుత అయిదుగురు డిఎల్‌పిఒలకు డిపిఒలు గా పదోన్నతులు కల్పించి వారిని డిపిఒలుగా జిల్లాలకు కేటాయించారు. ఎన్నికల సంఘం నిలిపివేయడంతో పదోన్నతులు పొందినప్పటికి పాత స్థానాల్లోనే కొనసాగుతున్నారు. ప్రస్తుతం వారిని అప్పట్లో పదోన్నతులపై  ని యమించిన జిల్లాలకు పోస్టింగులు ఇస్తున్నారు. వీరితో పా టు త్వరలో మరో 20 మంది అర్హులైన డిఎల్‌పిఒలకు డిపిఒలుగా పదోన్నతులు కల్పించే ప్రక్రియను కూ డా పంచాయతీరాజ్ శాఖ చేపట్టింది.  వెల్లను న్న వారి వద్ద నుంచి ఎన్నికల నిర్వహణకు సంబంధించి న పూర్తి సమాచారాన్ని సేకరించిన తర్వాతే వారిని రిలీవ్ చేయాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. వీరు కాక పంచాయతీరాజ్‌లో  ఎంపిడిఒ, ఇఒఆర్‌డి, పంచాయతీకార్యదర్శుల పదోన్నతులు కల్పించాల్సి ఉంది. స్థానం మారితే ఎన్నికలకు ఇబ్బంది అని ఎక్కడి వారక్కడే ఉం డాలన్న ఉద్ధేశ్యంతో ఎన్నికల సంఘం బదిలీలకు బ్రేకు లు వేసింది. పదోన్నతులు కల్పిస్తే వారికి కొత్త చోటికి ప దోన్నతి స్థానానికి పంపించాల్సి ఉంటుంది. దీంతో పదోన్నతులపై ఆంక్షలు లేనప్పటికి వాటిని కూడా నిలిపివేయాల్సి వచ్చింది. బిసిల రిజర్వేషన్ల విషయంలో కోర్టు ఉత్తర్వులు వచ్చిన మరుక్షణమే పంచాయతీరాజ్ శాఖ వీరి పదోన్నతుల ప్రక్రియను చేపట్టింది. ఎన్నికల సం ఘం అనుమతిచ్చిన వెంటనే జాప్యం చేయకుండా వారి కి పదోన్నతులు కల్పించి కొత్త స్థానాలకు పంపించాలన్న ముందస్థు వ్యూహంతో ఈ పని చేసింది. ఎంపిడిఓ పో స్టులు 44ఖాళీలు ఉండగా, ఉన్న వారిలో 72 మందిని డి ప్యూటేషన్‌పై పంపించడంతో మొత్తం 116 మండలాభివృద్ధికారులు పోస్టులు ఖాళీలు ఏర్పడ్డాయి. వీటికి కొత్త గా ఏర్పడిన మండలాల ఖాళీలు తోడయ్యాయి. ఇప్పటి వరకు కమిషనరేట్‌కు వచ్చిన సీనియారిటి జాబితా మే రకు 34 మందికి ఎంపిడిఓలుగా పదోన్నతులు ఇచ్చా రు. ఇంకా జాబితా రావాల్సి ఉందని, అవి రాగానే ఖాళీ ల మేరకు పదోన్నతులు కల్పించే అవకాశాలు ఉన్నాయ ని తెలుస్తోంది. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్( ఇఒఆర్‌డి) పోస్టు లు 71ఖాళీలు ఉండగా ఉన్న వారిలో తొమ్మిది మందిని డి ప్యూటేషన్‌పై పంపించడంతో ఈ ఖాళీల సంఖ్య 80కి చేరింది.  ఈఖాళీలలతో పాటు కొత్త పంచాయతీలు ఏర్పడిన నేపథ్యంలో మరో 60మంది అర్హులైన వారికి ఇఒఆర్‌డి పదోన్నతులు కల్పించాలని నిర్ణయించారు. ఈ మేర కు  సీనియారిటి జాబితా తెప్పించుకుని 130 మందికి ఇఒఆర్‌డిలుగా పద్నోన్నతులు కల్పించారు.  మరో 30 మందికి ఇఒఆర్‌డిలుగా పదోన్నతులు కల్పించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఎన్నికల సంఘం అనుమతివ్వడంతో ఇప్పటికే పదోన్నతులు ఖరారైన వారికి  పోస్టింగులు ఇచ్చే పనిని అధికారులు మొదలుపెట్టారు.  జోన్-5లో 165, జోన్-6లో 165మంది పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతులు కల్పించారు.  ఎన్నికల సంఘం ఆంక్షల కారణంగా పోస్టింగులు ఇవ్వలేదు. ఇప్పుడు పోస్టింగులను కేటాయించే పనిలో నిమగ్నమయ్యారు.

Comments

comments