Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

ఎన్నికల పంచాయతీ

Election panchayat

ఓటర్ల జాబితాపై అసంతృప్తులు
భారీగా ఓట్లు గల్లంతు
అయ్యాయంటున్న రాజకీయ పక్షాలు

మనతెలంగాణ/కరీంనగర్‌ప్రతినిధి: జిల్లాలో పం చాయతీ ఎన్నికల నిర్వహణ వేగం పుంజుకుంది. ఎ న్నికల నిర్వహణలో అత్యంత కీలకమైన ఓటర్ల తు ది జాబితాలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఖరారు చేసి వెబ్‌సైట్‌లో అందరికి అందుబాటులో ఉంచింది. అ యితే ఓటర్ల జాబితా పట్ల అభ్యంతరాలు ఇంకా వె ల్లువెత్తుతూనే ఉన్నాయి.అనేక గ్రామాలలో పెద్ద ఎ త్తున ఓట్లు గల్లంతయినట్లు అధికారులకు ఫిర్యాదు చేసినా సంబంధిత ఓటర్లను తిరిగి చేర్చలేదన్నది వివిధ రాజకీయ పక్షాల ప్రధాన ఆరోపణ. ఉదాహరణకు కరీంనగర్ పట్టణాన్ని ఆనుకునే ఉన్న బొమ్మకల్ గ్రామ పంచాయతీలో ఏకంగా 1200 ఓట్లు గ ల్లంతుకాగా,జాబితాలో ఉన్న ఓట్లలో సైతం తప్పు లు చోటుచేసుకోవడాన్ని స్థానికులు అధికారుల దృ ష్టికి తెచ్చారు. ఇక్కడ ఓ కుటుంబంలో భార్య ఓటు ఉంటే భర్త ఓటు గల్లంతు కావడం గమనార్హం.ఇ లాంటివి సవరించకుండా ఎన్నికలకు వెళ్లడం సరికాదని బొమ్మకల్ వాసులు అభిప్రాయపడుతున్నా రు.ఇదిలావుండగా పంచాయతీల సత్వర ఎన్నికల వైపే ప్రభుత్వం మెగ్గుచూపుతుండడంతో గ్రామీణ ప్రాంతాలు అప్పుడే ఎన్నికల కళను సంతరించుకున్నాయి. ఎన్నికలకు బిసి ఓటర్ల గణన, రిజర్వేషన్ల ఖరారు మాత్రమే మిగిలి ఉండడంతో పల్లెల్లో ఎన్నికల సందడి కానవస్తున్నది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గతంలో గ్రామ పంచాయితీలుగా ఉండి పురపాలక సంఘాలుగా రూపాంతరం చెందినవి,మరికొన్ని పురపాలక సంఘాలలో విలీనం అయినవి పోగా కరీంనగర్,జగిత్యాల, పెద్దపల్లి,రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎన్నికల పంచాయతీ కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలతో కలిసి 1211 పంచాయితీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.నాలుగు జిల్లాల పరిధిలోని మొత్తం గ్రా మ పంచాయతీల్లో 14,45,051మంది ఓటర్లుగా నమోదై ఉన్నారు. ప్ర స్తుత సర్పంచ్‌ల పదవి కాలం జూలై 31తో ముగుస్తున్నందున అలోగానే పంచాయితీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. రాష్ట్ర శాసన సభ ఎన్నికలకు మరో ఎడాది గడువు మాత్రమే ఉన్న సమయంలో జరగనున్న పంచాయతీ ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నాయి.
కరీంనగర్ జిల్లాలో గతంలో ఉన్న 276 గ్రామ పంచాయతీలకు తో డుగా మరో 54 పంచాయితీలు కొత్తగా ఏర్పడాయి. దీంతో జిల్లాలో పం చాయతీల సంఖ్య 313కు చేరుకుంది. ఈ మొత్తం పంచాయితీలో 2, 968 వార్డులకు కూడా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. మొత్తం 1,84,068 మంది పురుషులు,1,81,284 మందిమహిళలు ఓటు హ క్కును కలిగి ఉన్నారు. జగిత్యాల జిల్లాలో గతంలో 327 గ్రామ పంచాయతీలు ఉండగా నూతనంగా ఏర్పాటు చేసిన పంచాయితీలతో కలుపుకొని ఆ సంఖ్య 380కి చేరింది.
ఈ జిల్లాలో 25తండాలతో పాటు మరో 35అనుబంధ గ్రామాలు నూ తన పంచాయితీలుగా రూపుదిద్దుకున్నాయి.ఈ జిల్లాలో అత్యధికంగా ఎనిమిది మేజర్ గ్రామపంచాయతీలు ఉండగా మొత్తం పంచాయితీల తో పాటు 3500 వార్డులకు ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. జగిత్యా ల జిల్లాలో మొత్తం 4,87,144మంది అర్హత కలిగిన ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం ధృవీకరించింది.పెద్దపల్లి జిల్లాలో నూతనంగా ఏర్పడిన వాటితో కలిపి మొత్తం 263 పంచాయతీలు, 2436 వార్డులు ఉన్నా యి. జిల్లాలో నూతనంగా 65పంచాయతీలు ఏర్పడగా మొత్తం 3,20, 139 మంది ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటు ంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం 255 పంచాయతీలు, 2240 వా ర్డులు ఉన్నాయి. మొత్తం 2,72,405 మంది ఓటర్లు పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అర్హత కలిగి ఉన్నారు. సిరిసిల్ల పట్టణ పరిధిలోని ఏడు గ్రామాలను పురపాలక సంఘంలోవిలీనం చేయడంతో ఆ గ్రామా లు మినహా మిగిలిన వాటికి ఎన్నికలు జరగనున్నాయి.

Comments

comments