Search
Wednesday 26 September 2018
  • :
  • :

గుజరాత్‌లో నేడే తుదిపోరు

ఉత్తర, మధ్య గుజరాత్‌లో 93 స్థానాలకు పోలింగ్
14 జిల్లాల్లో 851 మంది అభ్యర్థులు

Gujarat

అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తుదివిడత పోలింగ్ గురువారం జరగబోతున్నది. ప్రధాని నరేంద్ర మోడీ ఉద్విగ్నభరిత ప్రచా రం, రాహుల్ గాంధీ సుడిగాలి ప్రచారంతో కీలక పోలింగ్ ఘట్టం రోమాంచకంగా మారింది. మొత్తం 851 అభ్యర్థులు 14 ఉత్తర, మధ్య గుజరాత్ జిల్లాల్లోని 93 స్థానాల కు పోటీపడుతున్నారు. 2.22 కోట్ల మంది ఓటును వినియోగించుకోబోతున్నారు. డిప్యూటీ సిఎం నితిన్ పటేల్, కాంగ్రెస్‌కు చెందిన జీవాభాయ్ పటేల్‌తో మెహెసానాలో తలపడుతున్నారు.

కాంగ్రెస్‌లోకి మారిన అల్పేష్ ఠాకుర్ రాధన్‌పూర్‌లో బిజెపికి చెందిన లావింగ్జీ ఠాకుర్‌తో పోటీపడుతున్నారు. ఒకప్పుడు మోడీ ప్రాతినిధ్యం వహించిన మణినగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు చెందిన శేతా భ్రంభట్ బిజెపి సిట్టింగ్ ఎంఎల్‌ఎ సురేశ్ పటేల్‌తో తలపడుతున్నారు. వడ్‌గామ్ ఎస్సీ స్థానంలో కాంగ్రెస్ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థి జిగ్నేశ్ బిజెపి అభ్యర్థి విజయ్ చక్రవర్తితో పోటీపడుతున్నారు. బిజెపిపై గెలుపు సాధించేందుకు కాంగ్రెస్ హార్దిక్ పటేల్, ఠాకుర్, మేవానీలకు చెందిన పటీదార్, ఓబిసి, దళిత కుల బ్లాక్‌లను పోగుచేసుకుంది. మోడీ సీప్లేన్‌లో వచ్చి మరీ ఉద్విగ్నభరిత ప్రచారం చేశారు. కాగా రాహుల్ గాంధీ విలేకరులతో మాట్లాడుతూ గుజరాత్‌లో అంతర్గతంగా బిజెపి పాలనపట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందన్నారు.

Comments

comments