Home తాజా వార్తలు ఇ-బస్సులు.. అనుకూలం

ఇ-బస్సులు.. అనుకూలం

Electric buses అందుబాటులో అన్నిరకాల సదుపాయాలు
శబ్ద, కాలుష్య రహితంతోపాటు శుభ్రత
భద్రత…. నిర్వహణకు సైతం పెద్దపీట
విద్యుత్ బస్సులపై ప్రయాణికుల ప్రశంసలు

మన తెలంగాణ / హైదరాబాద్: నగర రహదారులపై పరుగులు పెడుతున్న విద్యుత్ బస్సులు ప్రయాణికుల నుంచి సానుకూల స్పందన వ్యక్తమవుతుంది. హైదరాబాద్ లాంటి కాలుష్య నగరానికి ఇటువంటి బస్సులు మరిన్ని అవసరమనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అత్యాధునిక సౌకర్యాలు, ప్రయాణికులకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలతో పాటు భద్రతకు సైతం పెద్దపీట వేయడంతో పాటు శబ్ధ, వాయు కాలుష్యం లేకుండా ఉండే ఈ బస్సుల్లో ప్రయాణం ఆహ్లాదకరంగా సాగుతుందనే ప్రయాణి కులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో విద్యుత్ బస్సులను నిర్వహిస్తున్న ఆర్‌టిసి బిహెచ్‌ఇఎల్, మియాపూర్, జెబిఎస్, సికింద్రాబాద్ ప్రాంతాల నుంచి రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాని సర్వీసులను నిర్వహిస్తుంది.

అత్యాధనిక సాంకేతిక పరిజ్ఞానంతో అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ బస్సుల పట్ల ప్రయాణికులు ఆసక్తిని కనబరుస్తున్నారు. మార్చి ఐదవ తేదీన ప్రారంభించిన విద్యుత్ బస్సులు ప్రయాణికుల సేవల్లో తరిస్తున్నాయి. నెల పది రోజులుగా సాగుతున్న బస్సుల నిర్వహణ ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి.
సత్పలితాల దిశగా విద్యుత్ బస్సులు

విద్యుత్ బస్సులు ఆశించిన ఫలితాలనందిస్తున్నాయని ఆర్‌టిసి అధికారులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. బస్సుల నిర్వహణపై సంబంధిత ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి లో పరిశీలించి ప్రయాణికుల మనోభిష్టాన్ని తెలుసుకున్నట్లు సమాచారం. ప్రయాణికుల భద్రత, సౌకర్యంతో పాటు సదుపాయాలు తదితర అంశాలు ప్రతిపాదికగా తీసుకొని ప్రయాణికుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. బస్సుల ప్రారంభమైన నాలుగైదు రోజుల పాటు టికెట్ల జారీతో పాటు రూట్‌లో ఇబ్బందులతో పాటు చిన్న చిన్న సమస్యలు తలెత్తాయి. వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకున్నారు.

దీంతో పాటు తలెత్తిన పలు రకాల సాంకేతిక సమస్యలను తక్షణమే పరిష్కరించినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రయాణికుల నుంచి కొన్ని విజ్ఞప్తులు కూడా అందినట్లు అధికారులు తెలిపారు. ఇందులో ప్రధానంగా ప్రస్తుతం ఉన్న స్టాప్‌ల సంఖ్యను మరింత పెంచి అవసరమైన ప్రాంతాల్లో నూతనంగా స్టాప్‌లను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తులు అందినట్లు ఆర్‌టిసి యాజమాన్యం తెలిపింది. దీనిపై త్వరలో బోర్డు సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకునేందుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేసినట్లు సమాచారం. దీంతో పాటు బస్సులను ఇంటర్నేషనల్‌తో పాటు డొమెస్టిక్ ర్యాంపు దగ్గరికి బస్సులు చేరుతున్నందున క్యాబ్‌ల కంటే బస్సుల్లో ప్రయాణానికే మక్కువ చూపుతున్నారు.

బస్సు దిగిన తర్వాత ఎక్కువ దూరం నడవకుండా ఉండేందుకు కూడా చర్యలు తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. గతంలో 46 బస్సుల ట్రిప్పులుగా ఉన్న ఎసి బస్సుల నిర్వహణ ఉండగా ప్రస్తుతం ఈ సంఖ్యను 63కు పెంచినట్లు తెలిపారు. దీనివల్ల
కాలుష్య రహితం, భద్రత, శుభ్రతకు పెద్దపీట విద్యుత్ బస్సులు కాలుష్య రహితంగా ఉండడం మంచి పరిణామం కాగా బస్సులో ప్రయాణికుల అవసరమైన స దుపాయాలున్నాయని పలువురు ప్రయాణికులు తెలిపా రు. ఇందులో ప్రధానంగా సెల్‌ఫోన్ ఛార్జీంగ్, వైఫై సేవలతో పాటు సిసి కెమెరాలు ఏర్పాటు వల్ల మహిళలకు భ ద్రత పరంగా కూడా ఎలాంటి సమస్యలు తలెత్తవన్నారు. వీటికి మంచి బస్సు చాలా నీట్‌గా క్లీన్‌గా ఉండ డం ఆహ్లాదకరంగా ఉందంటున్నారు.

సౌకర్యవంతమైన సీటింగ్ అరేంజ్‌మెంట్‌తో పాటు ఇతర వసతులు కూడా బాగున్నాయనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు, ప్రయాణికులకు పెద్దగా అవగాహనలేదని. వీటి గురించి తెలియజేయాల్సిన అవసరం అధికారులకు అవసరం ఉందని తెలిపారు. కండక్టర్ లేకపోవడంతో డ్రైవర్లే టిక్కెట్లను ఇష్యూ చేయడం కొంత ఇబ్బందికరంగా ఉందని తెలిపారు.

ప్రయాణికులకు మెరుగైన సేవలే లక్షం: టిఎస్‌ఆర్‌టిసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినోద్‌కుమార్

నగరంలోని తిరుగుతున్న విద్యుత్ మస్సులు ప్రయాణికులకు సౌకర్యవంతమైన సేవలను అందిస్తున్నాయని గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినోద్ తెలిపారు. ప్రయాణికులకు ఆశలు, సంస్థ లక్షానికి అనుగుణంగా బస్సులను నిర్వహణ కొనసాగుతుందని చెప్పారు. ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు లేకుండా సమర్థవంతంగా తిరుగుతున్నాయని తెలిపారు. బస్సులను ప్రారంభించిన తర్వాత వారం, పది రోజుల పాటు చిన్నపాటి సమస్యలు ఉత్పన్నమైనా వెంటనే వాటిని అధిగమించి ప్రయాణికుల పూర్తిస్థాయిలో సౌకర్యవంతమైన ప్రయాణాలను అందిస్తున్నామన్నారు.

Electric buses in Hyderabad