Home తాజా వార్తలు త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు : మహేందర్‌రెడ్డి

త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు : మహేందర్‌రెడ్డి

P.MAHENDER

హైదరాబాద్ : త్వరలోనే ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభిస్తామని తెలంగాణ రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే ఆర్‌టిసి ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆదివారం ఆయన శాసనమండలిలో మాట్లాడారు. ఫేమ్ ఇండియా పథకం కింద కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ బస్సులను అందుబాటులోకి తెస్తున్నామని ఆయన వెల్లడించారు. తొలి దశలో 40, రెండో దశలో 60 బస్సులను ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. నష్టాల నుంచి ఆర్‌టిసి గట్టెక్కించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఆర్‌టిసి బస్సుల్లోనే ప్రయాణించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Electric buses soonly Come : Mahender Reddy