Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

సౌరమే శరణ్యం

pmకాలుష్య నివారణకు సౌర విద్యుత్ ఉత్పాదనే మార్గం : ఎంపిల ఎలెక్ట్రిక్ బస్సుకు జెండా ఊపుతూ ప్రధాని మోడీ స్పష్టీకరణ

న్యూఢిల్లీ: పర్యావరణ కాలుష్యం సమస్యగా తయారైందని, దానికి విరుగుడుగా సౌర విద్యు త్తును ఉత్పత్తి చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. పర్యావరణం మీద చాలా కాలంగానే చర్చలు జరుగుతున్నాయని, కాలుష్యం ప్రభా వం మానవ జీవితం మీద తీవ్రంగా పడుతున్న దని, ఈ సమస్యకు పరిష్కారం కనుగొ నడం మానవాళి ముందున్న సవాలని ఆయన అభిప్రాయపడ్డారు. పార్లమెంటు సభ్యుల కోసం కేంద్ర ఉపరితల రవాణా మంత్రి గడ్కరీ కానుకగా ఇచ్చిన ఎలక్ట్రిక్ బస్‌కు జెండా ఊపిన సందర్భంలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ విషయాలు చెప్పారు. అనేక దేశాలు సౌర విద్యు త్తును ఉత్పత్తి చేసేందుకు కృషి చేస్తున్నాయని నరేంద్ర మోడీ అన్నారు. పారిస్‌లో జరిగిన ప్రపంచ వాతావరణ సదస్సు గురించి ఆయన ఈ సందర్భంగా ఉటంకించారు. అమెరికా, ఫ్రాన్స్, భారత్ ఉమ్మడిగా ‘మిషన్ ఇన్నోవే షన్’ను ఆరంభించాయని అన్నారు. సూర్యకాం తి అపారంగా ఉన్న దేశాలను కలుపుకుని అంతర్జాతీయ సౌర కూటమిని ఏర్పాటు చేయ డం, హరిత సాంకేతికతలను(గ్రీన్ టెక్నాలజీస్) అభివృద్ధిపరచడం వంటివి బిల్, మెలిండా గేట్స్ ఫౌండేషన్ సాయం వల్ల సాధ్యమేనని అన్నారు. అంతర్జాతీయ సౌర కూటమి ప్రధాన కేంద్రం ఢిల్లీలోనే ఉండగలదని కూడా ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. సంవత్సరం పొడుగున 300 రోజులూ సూర్యకాంతిని పొందుతున్న దేశాలు 122 ఉన్నాయని, అవి ఈ సౌర కూటమి వల్ల ప్రయోజనం పొందగలవని, భారత్ పూనిక వల్లనే ఇది సాధ్యమైందని మోడీ అన్నారు. శిలాజ ఇంధన రహిత విద్యుత్తును(ఫాస్సిల్ ఫ్యూయెల్-ఫ్రీ ఎనర్జీ) ఉత్పత్తి చేయాలని, కొత్త అన్వేషణలు చేపట్టాలని పారిస్‌లో ప్రపంచ నాయకులు అభిప్రాయపడ్డారని, ఇందుకు తీర్మానాలు కూడా చేశారని ఆయన తెలిపారు.  కాలుష్యరహిత బస్సును సమర్పించి కేంద్ర రవా ణా మంత్రి గడ్కరీ పర్యావరణకు, సాంకేతికతకు మేలు చేశారని ప్రధాని ప్రశంసించారు. ఈ టెక్నాలజీని ప్రజా రవాణలో కూడా ఉపయోగిం చుకుంటే మంచిదన్న అభిప్రాయాన్ని కూడా ప్రధాని వ్యక్తం చేశారు. ఇలాంటి బస్సులు వాతావరణ కాలుష్యాన్ని తగ్గిస్తాయని, మెరుగైన బ్యాటరీలను కనుగొనేందుకు యువతరాన్ని పోత్సహిస్తాయని అన్నారు. దీని వల్ల ఎంపీలు లాభపడడమే కాకుండా, కొత్త తరం ‘స్టార్టప్ ఇండియా’, ‘స్టాండప్ ఇండియా’ కింద బ్యాటరీ లు వంటివి తయారుచేసి సేవలందించగలరన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. బ్యాటరీలు ఎక్కువ కాలం పనిచేసేలా పరిశోధనలు, అనేషణలు చేపట్టాలని, అలాంటివి ‘భారత్‌లో తయారీ’( మేక్ ఇన్ ఇండియా) కింద రూపొందిస్తే భారత దేశానికే కాకుండా, మొత్తం ప్రపంచానికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఈ సందర్భంలో కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ కూడా ఆయనతో ఉన్నారు.

Comments

comments