Home తాజా వార్తలు హైదరాబాద్‌కు విద్యుత్ బస్సులు

హైదరాబాద్‌కు విద్యుత్ బస్సులు

Electric Buses to Hyderabad

హైదరాబాద్ : హైదరాబాద్‌కు వంద విద్యుత్ బస్సులు రానున్నాయి. వచ్చే నెలలోనే ఈ బస్సులు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాలుష్యాన్ని తగ్గించేందుకు జిహెచ్‌ఎంసిలో 300 వాహనాలను వినియోగించే అవకాశం ఉంది. ఆర్‌టిసి ద్వారా ఈ విద్యుత్ బస్సులను నడిపేందుకు రంగం సిద్ధం చేస్తోంది. మొదటి దశలో భాగంగా వంద బస్సులను నడిపించాలని ప్రణాళికలను తయారు చేసింది. 40 విద్యుత్ బస్సుల కొనుగోలుకు అంగీకారం కుదిరింది. ప్రస్తుతం ఒక్కో విద్యుత్ బస్సు ఖరీదు 2కోట్ల 50 లక్షలుగా ఉంది. ఛార్జింగ్ సమస్య వల్ల మొదటి దశలో విమానాశ్రయ ప్రయాణికులకు మాత్రమే విద్యుత్ బస్సుల సేవలను అందిస్తామని అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం ఛార్జింగ్ పాయింట్లు లేకపోవడంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 10, ఆర్‌టిసి డిపోల్లో మరికొన్ని ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి ఎయిర్‌పోర్టు వరకు విద్యుత్ బస్సులు నడపనున్నట్టు అధికారులు తెలిపారు.

Electric Buses to Hyderabad