Friday, April 19, 2024

తెలంగాణలో డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఇక డీజిల్ బస్సులకు గుడ్‌బై చెప్పనున్నారు. టిఎస్‌ఆర్‌టిసి దాదాపు 550 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ నుంచి కొనబోతోంది. ఆ కంపెనీ మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్‌కు చెందింది. ఒలెక్ట్రాకు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం తొలుత 50 ఎలక్ట్రిక్ బస్సులు కొంటారు. అవి నగరం రోడ్లపై తిరుగనున్నాయి. ఈ ఎలక్ట్రిక్ బస్సు ఒక్కసారి ఛార్జీ చేస్తే 325 కిమీ. ప్రయాణిస్తుంది. ఇవే కాకుండా సింగిల్ ఛార్జీతో 225 కిమీ. కవర్ చేసే మరో 500 బస్సులను కూడా కొంటున్నారు.

పర్యావరణ కాలుష్యం, ఇంధన వినియోగం తగ్గించడంతో పాటు ఖర్చుల నియంత్రణకు ఎలక్ట్రిక్ బస్సుల వినియోగాన్ని పెంచేందుకు ఆర్టీసి చర్యలు తీసుకుంటోంది. ఈ బస్సులు ఎయిర్ కండిషన్డ్, సౌండ్ లేనివి. నగరంలోని వేర్వేరు డిపోలకు వీటిని కేటాయించనున్నారు. హెచ్‌ఎండిఏ పరిధిలోని ఐదు డిపోల్లో 500 ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ నిర్ణయించింది.పర్యావరణ పరిరక్షణకు, ఆర్టీసి ఖర్చులు తగ్గించేందుకు ఈ బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు టిఎస్‌ఆర్‌టిసి చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే రెండేళ్లలో మొత్తం 3400 ఎలిక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.

2025 నాటికి హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో పూర్తిగా ఎయిర్ కండిషన్డ్, ఎలక్ట్రిక్ బస్సులు నడుపనున్నట్లు టిఎస్‌ఆర్‌టిసి మేనేజింగ్ డైరెక్టర్ వి.సి. సజ్జనార్ తెలిపారు. కాగా తమ కంపెనీకి వచ్చిన ఆర్డర్ ప్రకారం దశలవారీగా ఎలక్ట్రిక్ బస్సులను అందజేయనున్నట్లు ఒలెక్ట్రా సిఎండి కె.వి. ప్రదీప్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News