Home జిల్లాలు కరెంట్ కోతలు లేవు.. విద్యుత్ వెలుగులే

కరెంట్ కోతలు లేవు.. విద్యుత్ వెలుగులే

medakటిఆర్‌ఎస్ ప్లీనరీ సమావేశానికి 4 వేల మంది హాజరు..
15 ఏళ్ల పోరాటం.. త్యాగఫలం బంగారు తెలంగాణ
ఎడారైన తెలంగాణ.. కోటి ఎకరాలు సస్యశ్యామలం
మిషన్ భగీరథ సృష్టికర్త కెసిఆర్
ఉపసభాపతి పద్మాదేవేందర్ రెడ్డి
మెదక్:ఖమ్మంలో ఈ నెల 27న నిర్వహించే ప్లీనరీ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా 4 వేల మంది ప్రతినిధులు, మెదక్ నియోజకవర్గం నుండి ఐదు వందల మంది పాల్గొంటున్నట్లు ఉప సభాపతి, మెదక్ శాసనసభ్యురాలు పద్మాదేవేందర్ రెడ్డి తెలిపారు. సోమవారం ఉదయం మెదక్ పట్టణంలోని గంగినేని సినిమా హాల్ ఎదురుగా మహబూబ్ కెనాల్ కాల్వ కెనాల్‌పక్కనే ఆమె సొంత ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేసిన అనంతరం స్థానిక రహదారి బంగ్లాలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ పోరాట ఫలం నెరవేరిం దని, బంగారు తెలంగాణ దిశలో అడుగుపెడుతున్నామని ఆమె అన్నారు. తెలంగాణ ప్రజల నాలుగు దశాబ్దాల చిరకాల స్వప్నం నెరవేరబోతుందని, అందులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ మహారాష్ట్ర ప్రభుత్వంతో గోదావరి జలాల వినియోగం కోసం కృషి మరువరానిదని అన్నారు. గోదావరిపై మేడిగడ్డ, ప్రాణహితపై తుమ్మిడి హట్టి, పెనుగంగపై మూడు చోట్ల బ్యారేజిల నిర్మాణం పనులు త్వరలోనే చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. ఈ ప్రాజెక్టుల వల్ల మెదక్ జిల్లా కూడా సస్యశ్యామలం అవుతుందని ఆమె కొనియాడారు. ప్రాజెక్టుల నిర్మాణంలో దేశంలోనే మొదటి స్థానం తెలంగాణ ప్రభుత్వానికి దక్కిందని ఆమె అన్నారు.
తెలంగాణలో విద్యుత్ కోతల్లేవ్..
సమైఖ్యాంద్ర పాలనలో తెలంగాణలో కరెంటు శాపంగా మారిందని, నిత్యం కరెంటు కోతలు, ఉక్కపోతలు, పరిశ్రమలు మూతలు కావల్సినంత కరెంటు అందుబాటులో ఉండకుండా చేశారు. కరెంటు కోసం ఎన్నొ కుట్రలు చేశారు. తెలంగాణ వస్తే చిమ్మచీకట్లేనని ప్రచారం చేశారని పద్మాదేవేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుండి రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఎత్తివేసిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కిందన్నారు. మెదక్ నియోజకవర్గం సింగూరు పెద్దిరెడ్డిపేట నుండి మిషన్ భగీరథ ద్వారా 873 హాబిటేషన్లకు, రెండు మున్సిపాలిటీలకు త్రాగునీరు అందుతుందని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, వైస్ చైర్మన్ రాగి అశోక్, టిఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షులు గంగాధర్, ఎంపిపి లక్ష్మీకిష్టయ్య, జెడ్పిటిసి లావణ్యరెడ్డి, టిఆర్‌ఎస్ నాయకులు ఆకిరెడ్డి క్రిష్ణారెడ్డి, పిఆర్‌వో జీవన్‌రావు, తదితరులు పాల్గొన్నారు.
మన తెలంగాణ-మన వ్యవసాయం రథం ప్రారంభం
మన తెలంగాణ – మన వ్యవసాయం కార్యక్రమంలో భాగంగా సోమవారం నుండి రైతు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రచార రథానికి పచ్చజెండా ఊపి ఉపసభాపతి పద్మాదేవేందర్ రెడ్డి ప్రారంభించారు. సోమవారం అవుసులపల్లి, ఔరంగాబాద్, పాతూర్, శమ్నాపూర్ గ్రామాల్లో ఈ సదస్సులు నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ అధికారి రెబల్‌సన్ వివరించారు. మే 5వ తేది వరకు ఈ అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. మత్సశాఖ, పశుసంవర్థక, ఉద్యానవన శాఖల అధికారులు కూడా ఈ సదస్సులో పాల్గొంటారని తెలిపారు.
ఉపసభాపతి పద్మాదేవేందర్ రెడ్డి సొంత ఇంటికి భూమి పూజ..
మెదక్ పట్టణంలోని మహబూబ్ కెనాల్ కాల్వపక్కన గంగినేని సినిమా హాల్ సమీపంలో సోంత ఇంటి నిర్మాణం కోసం భూమి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి దేవేందర్ రెడ్డిలు భూమి పూజ చేశారు.