Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

ప్రమాదకరంగా విద్యుత్ తీగలు

Electrical wires Low Hight In Yacharam Village Rangareddy

యాచారంః యాచారం మండల పరిధిలోని కుర్మిద్ద గ్రామంలో గత కొన్ని రోజులుగా విద్యుత్ తీగలు కిందకు వేలాడుతూ ప్రమాదకరంగా ఉన్నాయని గ్రామస్థులు ఆవేధన చెందుతున్నారు.గ్రామం నడిబొడ్డున నిత్యం జన సంచారం గల రోడ్డు పక్కనే ఉన్న శ్రీఆం జనేయస్వామి ఆలయం వద్ద కరెంటు తీగలు కిందకు వేలాడుతూ ఎప్పుడు ఏప్రమాదం ముంచుకొస్తుందోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు.గత కొన్ని రోజుల క్రితమే గ్రామంలో షార్ట్ సర్కూట్ కారణంగా పలు గృహాలలో విద్యుత్ ఉపకరణాలు కాలిపోయి తీవ్ర నష్టం సంభవించిందని గ్రామస్థులు మన తెలంగాణతో వాపోయారు. శుక్రవారం కూడా గ్రామ రైతు బక్కని వీరయ్యకు చెందిన రూ.60వేలు విలువ గల పాడిగేదె పొలంలో మేసుకొంటూ ప్రమాదవశాత్తు బాగా కిందకు వేలాడి ఉన్న విద్యుత్ తీగలకు తగిలి అక్కడిక్కడే మృతి చెందిందని స్థానికులు విద్యుత్ అధికారుల తీరుపై మండిపడుతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తీగలను సరిచేసి ప్రమాదాలు జరుగకుండా చూడాలని కోరుతున్నారు.

Comments

comments