Home లైఫ్ స్టైల్ మీది ఉంగరాల జుట్టా..

మీది ఉంగరాల జుట్టా..

Elegant things in girls
ఉంగరాల జుట్టు ఎలాంటి ముఖాకారం ఉన్నవారికైనా నొప్పుతుంది. కలిగి ఉండే అమ్మాయిల్లోని సొగసైన విషయాలు – ఎలాంటి ముఖ ఆకారం కలిగి ఉన్నవారికైనా ఈ శిరోజాలు నప్పుతాయి. ఈ రకమైన జుట్టు కలిగి ఉన్నవారి ముఖంపై గల మడతలు కన్పించకుండా చేసి, ఏ వయస్సులో అయినా అందంగా కన్పించేలా సహకరిస్తాయి. కర్లింగ్ హెయిర్ తేమను కోల్పోయి వెంట్రుకల చివర్లు, లోనికి ముడుచుకొని ఆకృతి కోల్పోయినట్లయితేనే తప్ప కత్తిరించకూడదు. శిరోజాలు గడ్డం, కాలర్ బోన్స్ కి దగ్గరగా పొడవు పొరలు- పొరలుగా ఉండేట్లు చూసుకోవాలి. ఎపుడు కూడా జుట్టు ఉంగరాలుగా ఉన్నాయని బాధపడనవసరం లేదు. ఈ వెంట్రుకలు మీకు అనుకూలంగా ఉండేట్లు చేసుకోవాలి.

ఈ రకం వెంట్రుకలకు తగిన సంరక్షణ చాలా అవసరం. స్పష్టంగా చెప్పాలి అంటే, ఉంగరాల జుట్టు మృదువుగా మెరిసే విధంగా కన్పించాలి అంటే తేమ అధికంగా వుండాలి. కొన్ని నెలల వరకు ప్రత్యామ్నాయ రోజులలో వీటిని శుభ్రపరుస్తూ వుండడం వల్ల ప్రతిరోజూ పొడి బారినట్లుగా, చిట్లకుండా కాకుండా, ఆకర్షణీయంగా కన్పించేలా చేసుకోవచ్చు. హైడ్రేటింగ్ షాంపు కండిషనర్లను మాత్రమే ఉపయోగించాలి. మీరు మళ్లీ ఎపుడైనా స్టైలింగ్ క్రీమ్ కొనడానికి దుకాణాలకు వెళ్ళినపుడు, కొబ్బరి, ఖనిజ పదార్దాలు, బాదం నూనె వంటి సహజ పదార్దాలు కలిగి ఉన్న మంచి స్టైలింగ్ క్రీమ్‌లను ఎంచుకోవాలి. అందులో నుండి కొన్ని చుక్కలు తీసుకొని మీ తడి శిరోజాల కుదుళ్ళ నుండి చివరి భాగం వరకు పట్టించాలి. శిరోజాలను ఆరబెట్టుకోవడానికి మీరు ఎయిర్- డ్రయర్ ను ఉపయోగిస్తున్నట్లయితే వెంటనే మానుకోండి.

సహజ గాలి ద్వారానే ఆరేలా చూడాలి లేదా మీ వేళ్ళను ఉపయోగించి శిరోజాలను సగం నుండి ఒక అంగుళ భాగం వరకు తీసుకుంటూ వాటిని మెలి తిప్పుతూ మంచి ఆకృతి పొందేలా చేసుకోవచ్చు. షాంపూతో స్నానం చేయని రోజులలో, మీ వెంట్రుకలను తిరిగి నీటితో తడిపి కండిషనర్ పెట్టుకోవాలి. మిగతా అన్ని రకాల వెంట్రుకల కన్నా ఉంగరాల జుట్టు చాలా బలహీనంగా వుంటుంది.