Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

ప్రయాణికులపై ఏనుగు దాడి

Elephant-Attack-on-Auto

బెంగళూరు: కర్నాటక రాష్ట్రం కొడగు జిల్లా భజగొల్లి అటవీ ప్రాంతంలో ప్రయాణికులపై ఏనుగు దాడి చేసింది. ఆటోలో వెళ్తున్న ప్రయాణికులపై ఏనుగు దాడి చేయడంతో వారు ఆటోను వదిలి పరుగులు తీశారు. ఏనుగు తన తొండంతో ఆటోను ధ్వంసం చేసింది. ప్రయాణికులు రహదారి గుండా వెళ్తున్న వాహనాలను ఎక్కి వెళ్లి అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. అటవీ శాఖ అధికారులు అక్కడి చేరుకొని ఏనుగును పట్టుకుంటామని తెలిపారు.

Comments

comments