Home తాజా వార్తలు గజరాజు బీభత్సం…

గజరాజు బీభత్సం…

Elephant

కోల్ కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రం జల్ పాయగుడి జిల్లా బినాగురిలోని కంటోన్మెంట్ భోజనశాల గృహంలోకి ఏనుగు ప్రవేశించింది. ఏనుగు లోపలికి రావడంతో అక్కడ ఉన్నవారంత భయంతో పరుగులు తీశారు. మెస్ హాల్ లో గజరాజు బీభత్సం సృష్టించింది. భోజనశాల గోడను కూలగొట్టింది. స్థానికుల సమాచారం మేరకు అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకొని గజరాజును అడవిలోకి పంపించారు.