Home తాజా వార్తలు బాంబు తిని ఏనుగు మృతి

బాంబు తిని ఏనుగు మృతి

Elephant2

చెన్నై: కోయంబత్తూరులోని పెరియనాయకం పాళయం అడవిలో ఏడేళ్ల వయస్సు ఉన్న గున్న ఏనుగు నాటు బాంబు తిని మృతి చెందింది. ఏనుగు నోటికి పుడ్లు ఉండి నీరసంగా తిరుగుతుండటంతో అటవీ శాఖ అధికారులకు గ్రామస్థులు సమాచారమందించారు. వైద్యులు ఏనుగుకు 14 బాటిళ్ల గ్లూకోజ్ ఎక్కించారు. చికిత్స చేస్తున్న సమయంలో ఏనుగు గురువారం ఉదయం మృతి చెందింది. అడవి పందులు పట్టుకోవడం కోసం రైతులు నాటు బాంబులు పొలాల వద్ద ఉంచుతారని, చిన్న నాటు బాంబు తిన్న కారణంగా గున్న ఏనుగు చనిపోయిందని అటవీ శాఖ అధికారులు వెల్లడించారు.