Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

శ్రీవారి పాదాల చెంత ఏనుగుల గుంపు సంచారం…

Elephant group wandering at Tirumala

తిరుమల: తిరుమలలోని శ్రీవారి పాదాల చెంతకు వెళ్లే మార్గంలో ఏనుగుల గుంపు సంచరిస్తుండటంతో యాత్రికులు ఆందోళన చెందుతున్నారు. ఈ గుంపులో నాలుగు పెద్ద ఏనుగులు, ఓ పిల్ల ఏనుగు ఉన్నాయి. ఇవి రహదారిపై గుంపుగా చేరడంతో వాహనదారులు ఎక్కడికక్కడే వాహనాలను నిలిపివేశారు. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. కొద్దిసేపటి తర్వాత ఏనుగుల గుంపు పక్కకు వెళ్లడంతో తిరిగి వాహనాలు ముందుకు కదిలాయి. కాగా, నాలుగు రోజుల కిందట కూడా ఇలాగే ఈ ఏనుగుల గుంపు వాహనదారులను భయబ్రాంతులకు గురి చేశాయి. దాంతో ఆ మార్గంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే అధికారులు రాకపోకలకు అనుమతిస్తున్నారట.

Comments

comments