Home ఆఫ్ బీట్ వీడియోలు నడిరోడ్డుపై లారీని ఆపిన ఏనుగు..!

నడిరోడ్డుపై లారీని ఆపిన ఏనుగు..!

Elephant-Stops-Truck

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ లోని వెస్ట్‌ మిడ్నాపూర్‌ జిల్లాల్లోని గర్బేటా అటవీ ప్రాంతంలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఆ అటవీ ప్రాంతంలో ప్రయాణిస్తున్న ఓ లారీని నడిరోడ్డుపై ఓ ఏనుగు అడ్డుకుంది. భారీ ఏనుగు తన లారీకి అడ్డుగా రావడంతో భయపడిన డ్రైవర్ అక్కడి నుంచి పరుగు తీశాడు. కాగా లారీ చుట్టు తిరిగి దాన్ని పరిశీలించిన ఏనుగు లారీలో ఆలుగడ్డలు ఉన్నట్లు గుర్తించింది. లారీకి గట్టిగా టార్పాలిన్‌తో కట్టి ఉండటంతో తన తొండాన్ని లోపలికి పెట్టి అందినన్ని ఆలుగడ్డలను బయటకు లాక్కుంది. ఇది గమనించిన స్థానికులు గట్టిగా కేకలు వేస్తూ, మత్తాబులు పేలుస్తూ ఏనుగు వెళ్లగొడదామని ప్రయత్నించిన అది మాత్రం కదల్లేదు. తాను లాక్కున్న ఆలుగడ్డలన్నింటినీ తిన్నాక తీరిగ్గా అక్కడి నుంచి కదిలింది. ఈ ఘటనను మొత్తం కొంతమంది షూట్ చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారి నెటిజన్లు విపరీతంగా ఆకట్టుకుంటుంది.