Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

గజరాజం ఘీంకరించిన వేళ…!(వీడియో)

Elephant Vandalises House in Chhattisgarh's Surajpur

రాయ్‌పూర్: అసలే గజరాజు.. పైగా కోపంతో ఊగిపోతోంది. ఆ సమయంలో దాన్ని ఎదుట ఏది కనిపించిన చిత్తవ్వాల్సిందే. అలాంటి సమయంలో ఓ ఇంటిపై విరుచుకుపడింది. అమాంతం ఇంటిని కూలగొట్టేసింది. ఇంటి గోడలను కూలగొట్టడంతో పైకప్పు తనంతటా అదే నెలకూలిపోయింది. ఇంటిపై గజరాజం అలా ఒక్కసారిగా కసిగా విరుచుకుపడటం చూసిన గ్రామస్థులకు అసలేం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. ఒకింత షాక్‌లో ఉండిపోయారు వారు. అలా చూస్తుండిపోవడం తప్పా వారు ఏమీ చేయలేకపోయారు. దాంతో క్షణాల్లో ఇంటిని నేలమట్టం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయిందా గజరాజు. ఈ ఘటనతో ఇంటి యజమానికి దాదాపు రూ. 70వేల వరకు నష్టాన్ని మిగిల్చింది. చత్తీస్‌గఢ్‌లోని సురాజ్‌పూర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Comments

comments