Home జాతీయ వార్తలు ఏనుగుల బీభత్సం : ఇద్దరికి తీవ్ర గాయాలు

ఏనుగుల బీభత్సం : ఇద్దరికి తీవ్ర గాయాలు

Elephants Hulchul : Two Persons Injuredచెన్నయ్ : రెండు అడవి  ఏనుగులు  నగరంలోకి ప్రవేశించి బీభత్సం సృష్టించాయి.  సోమవారం తెల్లవారుజామున రోడ్ల మీదకు వచ్చిన ఈ ఏనుగులు ఇద్దరిపై దాడి చేశాయి. ఏనుగుల దాడిలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన  కోయంబత్తూరు సమీపంలోని పూచ్చియూర్‌ హైటెక్‌ సిటీ ప్రాంతంలో జరిగింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఆ రెండు ఏనుగులను బంధించి సమీప అటవీ ప్రాంతానికి తరలించారు.

Elephants Hulchul : Two Persons Injured