Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

కుప్పంలో ఏనుగుల బీభత్సం

ELEPHANTS

చిత్తూరు : కుప్పం నియోజకవర్గంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. కర్నాటక అటవీ ప్రాంతం నుంచి శాంతిపురం మండలంలోకి వచ్చిన ఏనుగులు నాలుగు రోజులుగా హల్‌చల్ చేస్తున్నాయి. రాత్రి సమయంలో అవి పంటలను నాశనం చేస్తున్నాయి. మూడు రోజుల క్రితం ఏనుగుల దాడిలో ఓ వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. మంగళవారం రాత్రి శాంతిపురం మండలం నుంచి రామకుప్పం మండలంలోకి ఏనుగులు వచ్చాయి. బుధవారం ఉదయం బందార్లపల్లె, నిన్నెర్తి, లింగాపురం తదితర ప్రాంతాల్లో అవి పంటలను నాశనం చేశాయి. అనంతరం అవి సమీపంలోని చెరువుల్లో సేద తీరుతున్నాయి. ఈ ఏనుగులను అటవీ ప్రాంతానికి తరలించేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏనుగుల బారి నుంచి తమ పంటలను కాపాడాలని రైతులు అటవీశాఖ అధికారులను కోరుతున్నారు.

Elephants  Hull chal in Kuppam

Comments

comments