Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

ఎల్లంపల్లి బాధిత కుటుంబాల రాస్తారోకో

  • మృతుల కారకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్
  • ఎల్లంపల్లి ప్రాజెక్టు అధికారులపై కేసులు పెట్టాలి
  • జెసి హామీతో ఆందోళన విరమణ
  • బాధితులకు అండగా నిలిచిన ప్రజా సంఘాలు

Yellampalli-Rastarokoమంచిర్యాల : శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పవిత్ర గోదావరి స్నానానికి వెళ్లి నీటి ప్రవాహంలో మునిగి మృతి చెందిన బాధిత కుటుంబాలు శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఆందోళన కార్యక్రమం నిర్వ హించారు. అధికారుల నిర్లక్షంతో జరిగిన ఈ ప్రమాదాన్ని గుర్తించి, తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ యువకుల మృతికి కారకులైన అధికారులపై కేసులు నమోదు చేయాలని పేర్కొంటూ ఆందోళన కార్య క్రమం చేపట్టారు. ఉదయం నది ప్రవాహంలో కొట్టుపోయి దొరికిన మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా బాధిత కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ విషయమై స్పందించిన ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆసుపత్రి వద్దకు చేరుకొని బాధిత కుటుంబాలను ఓదారుస్తూ న్యాయం కోసం ఆందోళన కార్య క్ర మాన్ని చేపట్టారు. సుమారు 3 గంటలపై గాప్రభుత్వ ఆసుపత్రి ఎదుట రాష్ట్రీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. దీంతో వాహనాల రాక పోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి ట్రాఫిక్ సమస్య నెలకొంది. విష యం తెలిసిన వెంటనే మంచిర్యాల సిఐ సుధాకర్ పోలీసు సిబ్బందితో ఆందోళన జరిగే ప్రాంతానికి చేరుకొని రాస్తారోకోను విరమించే ప్రయ త్నం చేశారు. ఎలాంటి సమాచారం లేకుండా ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్ల నుండి నీటిని విడుదల చేయడంతోనే తమ బిడ్డలను కోల్పొయామని విలపిస్తూ సంబందిత అధికారులపై కేసులు నమోదు చేసి, తమను ఆదుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు.వారికి అండగా తెలంగాణ జెఎసి నాయకులు కాంగ్రెస్ మినహా, ఇతర ప్రతిపక్ష పార్టీల నాయకులు స్పందిస్తూ అధికారుల వైఖరీని తీవ్రం గా ఎండగట్టారు.
జాయింట్ కలెక్టర్ హామీతో ఆందోళన విరమణ
ముల్కల్ల గోదావరి నదిలో వరద ప్రవాహంలో పుణ్యస్నా నాలకు వెళ్లి గల్లంతైన వారి బాధిత కుటుంబాలు చేపట్టిన ఆందోళనను జిల్లా జాయింట్ కలెక్టర్ హామీతో విరమిం చారు. శుక్రవారం పర్వదినం వేడుకల్లోభాగంగా పుణ్యస్నా నానికి వెళ్లి నలుగురు యువకులు గల్లంతు కాగా గజా ఈతగాళ్లు గాలించిన నేపథ్యంలో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఆయా కుటుంబాలు మృతదేహాలను చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఎదిగిన కొడుకులు విగత జీవులుగా ఉండడాన్ని జీర్ణించుకోలేక బోరున విలపిస్తూ న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం వరకు సాగిన ఆందోళన కార్యక్రమం వలన వాహనాల రాకపోకలు స్పందించినప్పటికీ జిల్లా కేంద్రంలోని ఉన్నతాధికారులు స్పందించకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఎట్ట కేలకు స్పందించిన జిల్లా జాయింట్ కలెక్టర్ ఆందో ళన కార్యక్రమానికి చేరుకొని పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా బాధిత కుటుంబాలను ఓదార్చారు. మృతుల కుటుం బాలకు రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం, 3 ఎకరాల ప్రభుత్వ భూమి ఇవ్వాలని ఆందోళనలో పాల్గొన్న ప్రజాసంఘాల నాయకులు డిమా ండ్ చేశారు. ఈ విషయమై స్పందించిన జెసి బాధిత కుటు ంబాలను ఆధుకునే విషయంలో ప్రభుత్వానికి నివేదించి, తన వంతు సాహకారాన్ని అందిస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరిమించారు.

Comments

comments