Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

అంతుచిక్కని ‘వైద్యం’

వారం రోజుల్లో ఐదు దూడలు మృతి
గ్రామంలో పశువైద్యశాల ఉన్నా.. లేనట్లే

laga

దేవరుప్పుల : మండలకేంద్రంలో పశువైద్యశాల ఉన్నప్పటికీ వైద్యుల నిర్లక్షంతో మూగజీవులు మృతిచెందాయి. మండల కేంద్రానికి చెందిన గోలి భాస్కర్‌రెడ్డి, గోలి యాదవరెడ్డి లకు సంబంధించిన పాడి పశువులు, దూడలు అనారోగ్యం బారిన పడగా వైద్యులు స్పందించక పోవడంతో ఆదివారం ఒక్క రోజే ఇరువురి రైతుల పాడి గేదేలు మృత్యువాత పడ్డాయి. భాస్కర్ రెడ్డి రైతు వారం రోజులుగా పశువైద్యధికారిణికి ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోకపోవడంతో మృతి చెందిందని తెలిపారు. శుక్రవారం పశువైద్యశాలకు వెళ్లినప్పటికీ వైద్యశాల మూసి ఉండటంతో వెనుదిరిగి రావల్సి వచ్చిందన్నారు.

దూడల కంటి నుండి తెల్లటి నీరు కారుతున్నట్లు, పూర్తిగా నిలబడలేని స్థితిలో పశువులు ఉన్నట్లు తెలిపారు. వారం రోజులుగా పశువులు, దూడలు అనారోగ్యం పాలవుతున్నప్పటికీ, రైతుల నుంచి ఫిర్యాదులు వచ్చినా మొక్కుబడిగా దూడలకు నట్టలు ఉన్నాయని తెలిపి చేతులు దులుపుకుంటున్నట్లు తెలిపారు. పాడి పశువులు తమ బిడ్డల కోసం అలమటిస్తున్నాయన్నారు.

వారంలో ఐదు రోజుల్లో గ్రామానికి చెందిన బుర్ర కిష్టయ్య రైతుది ఒకటి, మొట్ర కొమురయ్య రైతుది ఒకటి, గోలి వెంకట్డ్డ్రి రైతుది ఒకటి, గోలి భాస్కర్‌రెడ్డి రైతుది ఒకటి, గోలి యాదవరెడ్డి రైతుది ఒకటి దూడలు మృతి చెందాయన్నారు. ఆదివారం గ్రామానికి చెందిన రైతులు పశువైద్యధికారిణికి ఫోను చేయగా స్పందించలేదని రైతులు అన్నారు. దీంతో వైద్యం అందక దూడలు మృత్యువాతపడ్డాయి. గతంలో సైతం పశువైద్యులు సకాలంలో స్పందించకపోవడం పట్ల జిల్లా అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడంలేదని అన్నారు. దీంతో మూగజీవుల రోదన అలాగే కొనసాగుతున్నదని అన్నారు. గ్రామంలో ఇంకెన్ని మూగజీవులు మృత్యువాత పడుతాయోనని గ్రామ పాడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Comments

comments