Search
Sunday 23 September 2018
  • :
  • :

మరోసారి విప్రోకు బెదిరింపు ఇ-మెయిల్

Wipro

న్యూఢిల్లీ: ఐటి దిగ్గజం విప్రోకు నెల రోజుల్లోపే మరో బెదిరింపు ఇ-మెయిల్ వచ్చింది. ఈసారి కూడా రూ.500 కోట్లను బిట్‌కాయిన్ రూపంలో ఇవ్వాలని, లేకపోతే రిసిన్ రసాయంతో దాడి చేస్తామని ఇ-మెయిల్‌లో హెచ్చరించారు. ఈమేరకు కంపెనీ నుంచి పోలీసులకు ఫిర్యాదు అందింది. గతంలో వచ్చిన ఇ-మెయిల్ చిరునామాతోనే రెండోసారి మెయిల్ వచ్చిందని, 72 గంటల్లోగా అడిగిన నగదును ఇవ్వాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని సెండర్ హెచ్చరించాడని కంపెనీ ఫిర్యాదులో పేర్కొంది.  రెండోసారి కూడా కంపెనీకి బెదిరింపు ఇ-మెయిల్ రావడంతో విప్రో అప్రమత్తమైంది. తన అన్ని కార్యాలయ ప్రాంగణాలన్నింటిల్లోనూ భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. అయితే  ఇది కంపెనీ ఆపరేషన్స్‌లో ఎలాంటి ప్రభావం చూపదని సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది.

Comments

comments