Search
Saturday 22 September 2018
  • :
  • :

ఎమోషనల్ లవ్ స్టోరీ ‘దృశ్య కావ్యం’

Drushya-Kavyamరామ్‌కార్తీక్, కాశ్మీర కులకర్ణి జంటగా పుష్యమి ఫిల్మ్‌మేకర్స్ బ్యానర్‌పై శ్రీమతి బెల్లం సుధారెడ్డి సమర్పణలో బెల్లం రామకృష్ణారెడ్డి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘దృశ్యకావ్యం’. ఈ సినిమా ట్రైలర్‌ను హీరో నిఖిల్ హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ “సినిమా ట్రైలర్ చాలా బావుంది. చూడడానికి చాలా కొత్తగా అనిపించింది. మార్చి 18న ఈ సినిమా రిలీజ్ కానుంది. మంచి హిట్ కావాలని కోరుకుంటున్నా”అని అన్నారు. దర్శకుడు రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ “ఇది నా మొదటి సినిమా. సినిమాలోని ప్రతి సీన్ అందరికీ నచ్చేలా జాగ్రత్తగా తీశాం. అందరూ మనసు పెట్టి చేయడం వల్లనే దృశ్య కావ్యమైంది. ఇదొక ఎమోషనల్ లవ్ స్టోరీ. సరికొత్త కథాంశంతో, ఉత్కంఠ భరితంగా సాగుతుంది. కమలాకర్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను”అని చెప్పారు. సంగీత దర్శకుడు కమలాకర్ మాట్లాడుతూ “ఈ సినిమాలో నాకు నచ్చిన విషయం ఏమిటంటే ఒక్క ఫైట్, ఐటమ్‌సాంగ్ లేకపోవడం. రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్ కాదు ఇది. సినిమాలోని ‘ఏ కలవో…’ అనే పాట మంచి మెలోడియస్ సాంగ్‌గా నిలిచిపోతుంది”అని అన్నారు. రామ్ కార్తీక్ మాట్లాడుతూ “ఇదొక లవ్, కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ‘దృశ్య కావ్యం’ టైటిల్ వినడానికి ఎంత బావుందో… చూడడానికి ఇంకా బావుంటుంది. కమలాకర్ మ్యూజిక్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది”అని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాశ్మీర కులకర్ణి, రచ్చ రవి, మధునందన్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments