Search
Monday 16 July 2018
  • :
  • :
Latest News

భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి

Kalyan-Dhev

మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్‌దేవ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘విజేత’. రాకేష్ శశి దర్శకత్వంలో వారాహి చలన చిత్రం పతాకంపై ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం గురువారం విడుదలవుతున్న సందర్భంగా హీరో కళ్యాణ్‌దేవ్ మాట్లాడుతూ “సత్యానంద్ ఇనిస్టిట్యూట్‌లో నటనలో శిక్షణ తీసుకున్న తర్వాత దర్శకుడు రాకేష్ ఈ స్క్రిప్ట్‌తో నా దగ్గరికి వచ్చాడు. కథ నచ్చడంతో ఈ సినిమా చేశాను. అయితే చిరంజీవి ఈ కథలో కొన్ని మార్పులు చేయించారు. తండ్రి, కొడుకుల మధ్య నడిచే ఈ సినిమాలోని భావోద్వేగాలు అందరినీ ఆకట్టుకుంటాయి. అల్లరి చిల్లరగా తిరిగే యువకుడి పాత్రలో నేను నటించాను. దీంతో నా తండ్రికి కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఆ సమస్యలను ఎలా పరిష్కరించాను అనేది మిగతా కథ. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే ఈ చిత్రంతో హీరోగా పరిచయం కావడం ఆనందంగా ఉంది”అని అన్నారు.

Comments

comments