Home తాజా వార్తలు పెట్రోల్ బంక్ యజమాని దాష్టీకం..!(వీడియో)

పెట్రోల్ బంక్ యజమాని దాష్టీకం..!(వీడియో)

Employee at a petrol pump thrashed with whip for not coming to work

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. పెట్రోల్ బంకులో పనిచేసే యువకుడి పట్ల బంకు యజమాని కర్కశకంగా ప్రవర్తించాడు. యువకుడిని తాడుతో కట్టేసి కొరడాతో కొడుతూ దారుణంగా హింసించాడు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంగా ఉండటంతో సదరు యువకుడు పనికి వెళ్లలేదు. దీంతో పనికి ఎందుకు రావడం లేదంటూ యువకుడిని బంకులో కట్టేసి చావబాదాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో అంతర్జాలంలో వైరల్ అయింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వీడియోలోని దృశ్యాల ఆధారంగా బంకు యజమానిని అదుపులోకి తీసుకున్నారు.