Search
Wednesday 21 November 2018
  • :
  • :

ఫ్లైట్ తో పరారీ … (వీడియో)

Aeroplane

న్యూయార్క్: అమెరికా దేశం సియాటల్ లోని టకోమా విమానాశ్రయంలో ఓ విమానాన్ని అపహరించారు. ఎటిసి నుంచి అనుమతి తీసుకోకుండా  78 సీట్లు ఉన్న హోరైజన్ ఎయిర్ క్యూ400  విమానాన్ని పైలట్ దొంగలించారు. ఫ్లేన్ లో ఎవరూ లేకపోవడంతో విమానాయాన అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విమానం కీట్రన్ దీవుల్లో కూలినట్లు అధికారులు వెల్లడించారు. విమానంలో టేకాఫ్ కాగానే చక్కర్లు కొడుతూ కనిపించిందని స్థానికులు తెలిపారు. విమానం చేసిన విన్యాసాలను కొందరు ఫోన్ లో బంధించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అమెరికా జెట్ ఫైటర్లు వెంబడించినప్పటికి విమానాన్ని పట్టుకోలేకపోయారు.  కూలిన విమానం కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

Comments

comments