Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

విధుల పట్ల అప్రమత్తం

Collector4

గంభీరావుపేట: విధులపట్ల నిర్లక్షం వహిస్తే చర్యలు తప్పవని డీఆర్‌డీఏ ఏపీడీ మదన్‌మోహన్ హెచ్చరించారు.  గంభీరావుపేట మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం ఎదుట గురువారం నిర్వహించి ఉపాధి హామీ సామాజిక తనిఖీ ప్రజా వేదిక కార్యక్రమం నిర్వహించారు.  ఈ సందర్భంగా మండలంలో గత ఏడాది జనవరి నుండి అక్టోబర్ వరకు నిర్వహించిన ఉపాధి హామీ పను ల్లో మొత్తం మండల వ్యాప్తంగా రూ. 3కోట్ల 70లక్షల నిధులతో పనులు చేపట్టగా అందులో రూ. 70వేల నిధుల దుర్వినియోగం జరిగినట్లు గత వారం రోజులుగా నిర్వహించిన తనిఖీలో తేలింది.

దీంతో ఆగ్రహానికి గురైన ఏపీడీ నిధుల రికవరీకి ఆదేశించారు.  ఉపాధిహామీ సిబ్బంది గ్రామాల్లో క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించాలన్నారు.  ప్రతి గ్రామంలో 60శాతం మేరకు పనికల్పించాలని అలా టార్గెట్ చేరుకోని సిబ్బందిని తొలగిస్తామని హెచ్చరించారు.  అలాగే గ్రామాల్లో చేపట్టాల్సిన పనులకు సంబంధించి డిమాండ్ కాప్చర్ తీసుకోవాలని, పనులు లేనట్లయితే నో డిమాండ్ క్యాప్చర్‌ను తప్పనిక తీసుకోవాలన్నారు.  గ్రామాల్లో జరిగిన పనుల్లోని అవకతవకలపై ఆయన మండిపడ్డారు.  విధుల్లో నిర్లక్షం వహిస్తే ఇంటికి పంపిస్తామన్నారు.  ఎంపిడిఒ సురేందర్‌రెడ్డి, జడ్‌పిటిసి మల్లుగారి పద్మ, ఎంపిపి కమ్మరి గంగసాయవ్వ, ఎంపిటిసిలు కమలా కర్‌రెడ్డి, ఎస్‌ఆర్పీ రాంప్రసాద్, ఎస్టీఎం అశోక్, ఉపాధి హామీ ఏపీఎం రాజయ్య, టీఏలు సాయి, చారి, మహేశ్, డిఆర్‌పీలు పాల్గొన్నారు.

Comments

comments