Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

కారుణ్యం… కఠినత్వం!

Employees in a strange way

సిపిఒలో కారుణ్య నియామకాలే ఎక్కువ!
ఏళ్ల తరబడి ఒకేచోట తిష్ట                                                                                                                                    వింత పోకడలో ఉద్యోగులు
పోలీస్ అధికారులకూ తప్పని తిప్పలు
దిక్కుతోచని స్థితిలో ఉన్నతాధికారులు

మన తెలంగాణ/ఖమ్మం క్రైం : అది ఖమ్మం పోలీస్ కమిషనరేట్ కార్యాలయం. అక్కడ విధులు నిర్వహిస్తున్న మినిస్టీరియల్ సిబ్బంది ఎక్కువ మంది కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగం పొందిన వారే కుటుంబంలో పోలీస్ విధులు నిర్వహించి అసువులు బాసిన సమయంలో కుటుంబంలో ఒక్కరికి వారి అర్హతలను బట్టి ఉద్యోగ నికం చేపడతారు. యామ ఉద్యోగం పొందడానికి ముందు పోలీస్ శాఖ గురించి కానీ, విధివిధానాలు కానీ వారికి తెలిసి ఉండదు. కానీ ఎన్నో అర్హత పరీక్షల్లో నెగ్గి కష్టనష్టాలకోడ్చి ఉద్యోగాలు పొందిన పోలీస్ అధికారులను, పోలీస్ సిబ్బందిని సిపిఒ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిప్పుకుంటున్నారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఏ ఉద్యోగి అయినా తమ సర్వీసులో ఎన్నోసార్లు జిల్లా పోలీస్ కార్యాలయం మెట్లు ఎక్కాల్సిన అవసరం ఉంటుంది. ఉద్యోగుల బదిలీలు జరిగినప్పుడు, పదోన్నతులు పొందినప్పుడు పిఎఫ్, ఆరోగ్య భద్రత, ఇన్సూరెన్స్, ఇళ్ల రుణాల కోసం కచ్ఛితంగా మినిస్టీరియల్ సిబ్బంది అవసరం తప్ప క ఉంటుంది. దీన్ని అదనుగా చేసుకున్న సిబ్బంది వాళ్ల ఇస్టానుసారంగా వ్యవహరిస్తున్నారని కొందరు పోలీసు సిబ్బంది బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఏ అధికారికైనా మినిస్టీరియల్ సిబ్బంది పనితీరు ఎంతో అవసరం. అవసరాన్ని ఆసరాగా చేసుకున్న వీరు పైసలిస్తే తప్ప ఫైలు కదలదని అంటున్నారని ఎస్‌హెచ్‌ఒ స్థాయి అధికారులే చర్చించుకోవడం గమనార్హం. ఖమ్మం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో జిల్లాల పునర్విభజనకు ముందు సుమా రు 50 మందికిపైగా అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయంలో విధు లు నిర్వహించారు. జిల్లాల పునర్విభజన సమయంలో 51: 49 శాతంగా విడిపోయి ప్రస్తుతం ఖమ్మం సిపి కార్యాలయంలో మొత్తం 26 మందితోపాటు ఏఒ విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో ముగ్గురు సూపరింటెండెంట్‌లు, ఐదుగురు సీనియర్ అసిస్టెంట్లు, 18 జూనియర్ అసిస్టెంట్లు ఉన్నారు. వీరందరినీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా ఉన్న ఎఒ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు. క్షేత్రస్థాయి పరిశీలిన మొత్తాన్ని ఎఒ ఎప్పటికప్పుడు నేరుగా కమిషనర్‌కి తెలియజేస్తారు. అయినప్పటికీ వీరిలో మార్పు రావడం లేదు. ఇదేకాక కారుణ్య నియామకాల కింద నియమించబడిన వీరికి వృత్తి నైపుణ్యత కూడా తక్కువననే విమర్శ ఉంది. వృత్తి నైపుణ్యత కోసం పోలీస్ శాఖ, ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రజలను సమాజంలో ప్రతీక్షణం రక్షిస్తూ రాత్రనకా, పగలనకా విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది పట్ల అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ఇలా వ్యవహరించడం ఏమాత్రం సరికాదని పలువురు పోలీసు అధికారులు, కానిస్టేబుళ్లు అంటున్నారు. అసలే పోలీస్ శాఖలో క్రమశిక్షణ ఎక్కువ ఉంటుంది. కావున ఎవరు నోరు తెరిస్తే ఏం ఇబ్బంది తలెత్తుతుందోననే భావన వారిలో నెలకొని ఉంది. ఇప్పటికైనా పోలీస్ శాఖలో వ్యవస్థాగత మార్పులు, సంస్థాగత మార్పులు త్వరగా తీసుకోవాలని లా అండ్ ఆర్డర్ పరంగా ఎంతో ఒత్తిడితో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిపై పోలీస్ ఉన్నతాధికారులు దృష్టి సారించాలని పేరు చెప్పడానికి ఇష్ట పడని కొందరు పోలీస్ అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

comments