Home తాజా వార్తలు మెట్రో స్టేషన్ వద్ద ఉద్యోగుల ఆందోళన

మెట్రో స్టేషన్ వద్ద ఉద్యోగుల ఆందోళన

Miyapur-Metro-Station

హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో పనిచేసే స్టేషన్ అసిస్టెంట్ ఉద్యోగులను తొలగించడంపై వారు మియపూర్ మెట్రో స్టేషన్ వద్ద శుక్రవారం ధర్నాకు దిగారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా నగరంలోని మెట్రో స్టేషన్లలో అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్న దాదాపు 300 మంది ఉద్యోగులను తొలగించారు. దీంతో బాధితులు ఆందోళన బాట పట్టారు. మెట్రోలో జాబ్ పేరుతో ట్రిగ్ అనే సంస్థ ఒక్కొక్కరి వద్ద లక్ష రూపాయల వరకు వసూలు చేసిందని బాధితులు చెబుతున్నారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.