Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

జీవనోపాధి కోల్పోయిన వారికి ఉపాధి కల్పించాలి

table

*సీనియర్ సివిల్ జడ్జి కనకదుర్గ

మన తెలంగాణ/ ఆసిఫాబాద్ : సిర్పూర్ పేపర్‌మిల్లులో ఉద్యోగాలు కోల్పోయిన వారికి జీవనోపాధి కల్పించుటకు లీగల్ సర్వీస్‌కమిటీ చైర్మన్, జిల్లా జడ్జిల ఆదేశాల మేరకు శనివారం జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో లీగల్ సర్వీస్ అథారిటీ సమావేశాన్ని సీనియర్ సివిల్ జడ్జి కనకదుర్గ, జిల్లా జాయింట్ కలెక్టర్ అశోక్‌కుమార్‌లు నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ జీవనోపాధి కోల్పోయిన వారికి ఉపాధి క ల్పించడానికి, హెల్త్ కార్డులు,  అంత్యోదయ కార్డులు ఇప్పించుటకు, ఉన్న వనరులను ఉపయోగించి ఆర్థికాభివృద్ధి పొందడానికి అన్ని శాఖల అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భం గా జీవినోపాధి కోల్పోయిన వారికి ఉపాధి అవకాశాలు, మిగిలిన పరిశ్రమలలో అవకాశాలు, వారికి రావల్సిన పీఎఫ్ బకాయిలు, పెన్షన్ సదుపాయాల గురించి ఆయాశాఖల అధికారులను అడిగి తెలుసుకుని కలెక్టర్, ఆర్డివోల ద్వారా తగిన సహాయం తీసుకోవడానికి లీగల్ సర్వీస్ అథారిటి సహాయపడుటకు అవగాహన కల్పించుకునేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని  ఆమె తెలిపారు. జాయింట్ కలెక్టర్ అశోక్‌కుమార్ మాట్లాడుతూ సిర్పూర్ పేపర్ మిల్లులో ఉద్యోగాలు కోల్పోయిన వారికి జీవనోపాధి కొరకు ప్రభుత్వ పరంగా అన్నిశాఖల అధికారులు వారికి ఉపాధి కల్పించుటుకు వారివంతు సహాయ సహకారాలు  అందిస్తామన్నారు. అందరు కలిసి పనిచేసి మళ్లీ పేపర్‌మిల్లు తెరిచే వరకు వారిని ఆదుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో  సివిల్ జూనియర్ జడ్జి సురేష్, డీఆర్‌ఓ  కదం సురేష్, ఆర్డివో రమేష్‌బాబు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Comments

comments