Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

ఉపాధి పథకాలు వెంటనే అమలు చేయాలి: కెసిఆర్

CM KCR Visit the Police Command Center

హైదరాబాద్: తెలంగాణలో బిసి, ఎంబిసిలకు స్వయం ఉపాధి పథకాలు వెంటనే అమలు చేయాలని అధికారులను సిఎం కెసిఆర్ ఆదేశించారు. ప్రగతి భవన్‌లో సిఎం  వివిధ అంశాలపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. బిసి సంక్షేమశాఖకు ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసిందని తెలిపారు. నగర సమాఖ్యకు రూ. 10 కోట్లు, రజక సమాఖ్యకు 30.84 కోట్లు, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ. 10 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ… ఆర్థికసాయం అందించే కార్యక్రమాలను తక్షణమే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. మంత్రివర్గ ఉపసంఘం ప్రణాళిక ప్రకారం కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. రూ. లక్ష, రూ. 2 లక్షల విలువ చేసే యూనిట్లు మంజూరు చేయాలన్నారు. బ్యాంకులతో సంబంధం లేకుండా యూనిట్లు, ఆర్థికసాయం మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 బిసి రెసెడెన్షియల్ స్కూళ్లను అదనంగా ప్రారంభించాలని అధికారులకు సూచించారు. ప్రతి గ్రామంలో నర్సరీ పెంచాలని కెసిఆర్ చెప్పారు. వచ్చే ఏడాది నుంచి 10 కోట్ల మొక్కలు నాటే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రంకు హరితహారం కార్యక్రమాన్ని చేపట్టాలని సిఎం కెసిఆర్ తెలియజేశారు.

Comments

comments