Search
Friday 21 September 2018
  • :
  • :

విద్యాశాఖలో ఖాళీలదే రాజ్యం

school

*సర్కారు పాఠశాలల్లో ముందుకు చదువులు
* ఎంఇఒలుగా ప్రధానోపాధ్యాయులు
* ప్రశ్నార్థకంగా మారిన విద్యాబోధన
* ఇంచార్జీ ఎంఇఒలతో పర్యవేక్షణ కరువు

మనతెలంగాణ/మంచిర్యాల ప్రతినిధి:
విద్యాశాఖలో ఖాళీల కొరత మూలంగా చదువులు ముందుకు సాగడం లేదు. దశా బ్దాల కాలంగా ఎంఇఒల పోస్టులు భర్తీ చే యకపోవడంతో ప్రధానోపాధ్యాయులు ఇంఛార్జీ మండల విద్యాధికారులుగా కొనసాగుతున్నారు. ఎంఇఒల పోస్టులను భర్తీ చేయకపోవడంతో పర్యవేక్షణలోపించి సర్కారు పాఠశాలలు సక్రమంగా నడవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇంఛార్జీ ఎంఇఒల వలన ఉపాధ్యాయులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పాఠశాలలకు వెళ్లని సంఘటనలు కూడా ఉన్నాయి. విద్యారంగంలో ప్రభుత్వం ఎన్నో మార్పులు తీసుకువస్తున్న కార్యక్రమాలు చేపడుతున్నప్పటికి క్షేత్రస్థాయిలో పటిష్టత లోపం వలన చదువులు ముందుకు సాగడం లేదు. మంచిర్యాల జిల్లాలోని 18 మండలాల్లో ఎంఇఒల పోస్టులు ఖా ళీగా కనిపిస్తున్నాయి. జిల్లాలో గతంలో ఉన్న 14 మండలాలకు గానూ సీనియర్ ప్రధానోపాధ్యాయులే ఇంఛార్జీ ఎంఇఒలుగా విధులు నిర్వహిస్తున్నారు. శాశ్వత అధికారులు లేకపోవడంతో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒక్కొక్క ఎంఇఒ 40 నుంచి 50 పాఠశాలలను పర్యవేక్షించాల్సి వస్తుండగా విద్యాబోధన సక్రమంగా జరగడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. మంచిర్యాల జిల్లాలో  105 ఉన్నత పాఠశాలలు, 93 ప్రాథమికోన్నత 473, ప్రాథమిక పాఠశాలలు 12, కస్తూర్బా పాఠశాలలు 05, ఆదర్శ పాఠశాలలు కొనసాగుతుండగా ,14 మంది ఎంఇఓలు ఇంచార్జీలుగా వ్యవహరిస్తున్నారు. ఇలా ఉండగా ఉపా ధ్యాయుల ఉమ్మడి సర్వీస్ రూల్స్ 1998 నుంచి పెండింగ్‌లోనే ఉన్నాయి ఒకే డిఎస్సీ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయుల్లో ఉన్న కొంత మందిని స్థానిక సంస్థలకు చెందిన పాఠశాలలకు, మరికొందరిని ప్రభుత్వ పాఠశాలల్లో నియమించారు. సర్వీస్ రూల్స్ వ్యవహారంలో కొన్ని ఉపాధ్యాయ సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత లేఖను కేంద్రం పరిశీలనకు పంపింది. కేంద్రం బిల్లులు పెడితే తప్పా ప్రమోషన్లు వచ్చే పరిస్థితుల్లో లేవు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకొని బిల్లు పెట్టేవిధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఉపాధ్యాయులు కోరుతు న్నారు.
అంతే కాకుండా సీనియర్ ప్రధానోపాధ్యాయులు ఇంఛార్జీ ఎంఇఓలుగా వ్యవహరించడం వల్ల వారు విద్యాబోధనకు దూరం కావాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. ఇంఛార్జీ ఎ ంఇఓల వలన కొందరు ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్లడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కొంత మంది ఉపాద్యాయులు చుట్టపు చూపుగా పాఠశాలలకు వెళ్తుండగా మరికొందరు అధికార పార్టీ నాయకుల అం డదండలతో వెళ్లడం లేదు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన సక్రమంగా జరగకపోవడం, ఫలితాలపై ప్రభావాన్ని చూపిస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం సర్వీస్ రూల్స్ వ్యవహారంలో శ్రద్ధ చూపి ఎంఇఒలను నియమించాలని కోరుతున్నారు.

Comments

comments