Home నాగర్ కర్నూల్ ముగిసిన ఎంపిటిసి, జడ్పిటిసిల నామినేషన్లు

ముగిసిన ఎంపిటిసి, జడ్పిటిసిల నామినేషన్లు

మనతెలంగాణ/పెంట్లవెల్లి: బుధవారంతో ఎంపిటిసి, జడ్పిటిసిల నామినేషన్ల చివరిరోజు కావడంతో అభ్యర్థులు పోటాపోటీన వివిధ పార్టీల నుంచి నామినేషన్లు వేయడం జరిగింది. మండల కేంద్రంలో మొత్తం 6 ఎంపిటిసి స్థానాలకుగాను ఒక జడ్పిటిసి స్థానానికి గాను పెంట్లవెల్లి స్థానానికిగాను 9మంది నామినేషన్లు వేయగా… పెంట్లవెల్లి 2వ స్థానానికి 8మంది నామినేషన్లు వేయడం జరిగింది. మల్లేశ్వరానికి ఏడు మంది, గోపులాపురం 6మంది, జట్‌ప్రోల్ 8, కొండూరుకు 7గురు నామినేషన్లు వేయడం జరిగింది. జడ్పిటిసికిగాను టిఆర్‌ఎస్ పార్టీ నుంచి 2, కాంగ్రెస్ నుంచి 2, ఇండిపెండెంట్ ఒకటి నామినేషన్లు వేశారు.

ఇదిలా ఉండగా ఒకేపార్టీ నుంచి వర్గపోరు విభేదాలు ఉండటంతో ఒకసైడ్ జూపల్లి కృష్ణారావు వర్గం, మరోవైపు స్థానిక ఎమ్మెల్యే హర్షవర్దన్‌రెడ్డి వర్గం ఎవరికి వారు నామినేషన్లు వేశారు. పార్టీ బీఫాం అధికార పార్టీ ఎమ్మెల్యే హర్షవర్దన్‌రెడ్డి కావడంతో అతని సతీమణి చేతులమీదుగా ఆ వర్గానికి పంపిణీ చేయడం జరిగింది. జూపల్లి కృష్ణారావు వర్గానికి ఆశలు ఆడియాసలుగా మిగిలయ్యాయి.

Ends of MPTC and ZPTC nominations