Home మహబూబ్‌నగర్ కొత్తకోటలో ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడులు

కొత్తకోటలో ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడులు

Jaggeryకొత్తకోట: కొత్తకోట మండల కేంద్రంలోని సాయినాథ్ కిరాణం మర్చంట్‌పై బుధవారం సాయంత్రం ఎన్‌ఫో ర్స్‌మెంట్ అధికారులు దాడి చేసి 43 బస్తాల బెల్లంను స్వాధీనం చేసుకున్నారు. మహబూబ్‌నగర్ ఎన్‌ఫోర్స్ మెంట్ సిఐలు మధుబాబు,రాకేష్ వివరాల ప్రకారం కొత్తకోట మండల కేంద్రంలోని మదనాపురం రహదా రి సమీపంలో గల సాయినాథ్ కిరాణం మర్చంట్ యా జమాని బెల్లం నిల్వ వుంచాడనే సమాచారంతో దాడు లు చేశామని వారు తెలిపారు.
గత కొంత కాలంగా ఈ వ్యాపారస్తులు ఎవరికి అను మానం రాకకుండా పక్కల ఒక ఇంటికి సంబంధించిన రూంను అద్దెకు తీసుకోని భారీగా బెల్లం నిల్వ చేసి అమ్ముతున్నారనే సమాచారం అందిందని దానికి అను గుణంగానే దాడులు నిర్వహించామని ,ఈ దాడుల్లో ఒక బ్యాగు 30 కిలోల చోప్పున 43బస్తాలు స్వాధీనం చేసుకున్నామని వారు తెలిపారు. గతంలో ఇక్కడి వ్యా పారస్థులకు పిలిపించి బెల్లం అమ్మకుండా కౌన్సిలింగ్ నిర్వహించామని ,అయినా కూడా వ్యాపారస్తులు ఆదే శాలు భేఖతారు చేసి బెల్లం ను గృహలకే కాకుండా నాటుసారా తయారు చేసే వారికి కూడా అమ్ముతు న్నారని సమాచారం అందిందని వారు తెలిపారు. అక్రమ బెల్లం వ్యాపారస్థులు ఎక్కడి నుంచి దిగుమతి చేస్తున్నారని విచారణ చేస్తున్నట్లు వా రు తెలిపారు.
ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడులను కనిపెట్టి పరారైన మిగతా వ్యాపారస్థులు
కొత్తకోట మండల కేంద్రంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికా రులు దాడులు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో మి గిత హోల్‌సెల్స్ అధికారులు షాపులు మూసి పరారి అయ్యారు.కొత్తకోట ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో పలు కిరాణం,హోల్‌సెల్స్ వ్యాపారస్తులను పిలిచి పలు మా రు కౌన్సిలింగ్ చేసినా వ్యాపారస్థుల తీరు మాత్రం మా రటం లేదని పలువురు పట్టణ వాసులు వాపోతున్నా రు. కొంత మంది వ్యాపారస్థులు పట్టణంలో బడా రా జకీయ నాయకుల పలుకు బడితో బెల్లం వ్యాపారస్థు లకు అండదండలు అందిస్తున్నారని ,విరి వల్ల ప్రభుత్వ ఆశయాలకు తుట్లు పోడుస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నాటుసారాను ఆరికట్టేందుకు ప్ర భుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంటే కొత్తకోట పట్ట ణంలో మాత్రం వ్యాపారస్థులు దర్జాగా బెల్లాన్ని నాటు సారా తయారీ చేసేవారికి అమ్మి సొమ్ము చేసుకుంటు న్నారని అధికారులు మాత్రం తూతూత మాత్రంగా దా డులు చేసి చేతులు దులుపుకుంటున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బెల్లం నాటు సారాకు అమ్మితే కఠిన చర్యలు: ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు
కొత్తకోట మండలంలో కిరాణం వ్యాపారస్థులు గృహ లకు తప్పా నాటుసారా తయారు చేసే వారికి బెల్లం విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మ హబూబ్‌నగర్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిఐలు మధుబాబు, రాకేష్‌లు అన్నారు.ఈ కార్యక్రమంలో హెడ్‌కానిస్టేబుల్ సుదర్శన్‌స్వామి,సంతోష్‌కుమార్,అనిత,డ్రైవర్ విజయ్ తదితరులు పాల్గొన్నారు.